రీల్స్‌ మోజులో..  బావిపైకి ఎక్కి ఫోజులు.. కానీ, అంతలోనే..

రీల్స్‌ మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పురాతన బావిపైకి ఎక్కి రీల్స్ చేస్తూ.. ప్రమాదవశాత్తు అందులో పడి.. ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు  32 గంటల తర్వాత అతని శవాన్ని గుర్తించారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో డోంబివిలీలోని ఠాకుర్లీ ప్రాంతంలో వెలుగుచూసింది..
 

Dombivli 18 Year Old Youth Falls Into Well While Making Reel In Thakurli KRJ

చిత్రవిచిత్రమైన పనులు చేసి.. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అలాగే.. తాను కూడా సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఓ ప్రమాదక స్టంట్ చేసి.. ప్రాణాలు కోల్పోయాడు. సాగరసంగమం సినిమాలో కమల్ హాసన్ మాదిరి బావిపైకి ఎక్కి.. స్టెప్పులేస్తూ.. రీల్స్ చేయబోయాడు. కానీ, ప్రమాదవశాత్తు బావిలో పడి 32 గంటల తర్వాత శవమై తేలాడు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని  డోంబివిలీలో చోటు చేసుకుంది. 

పోలీసులు అందిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని డోంబీవలీ పరిధిలోని ఠాకురలీ ప్రాంతానికి చెందిన బిలాల్‌ సోహేల్‌ షేక్‌ (18) అనే టీనేజర్ కు  రీల్స్‌ అంటే తెగ పిచ్చి.. సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ కావాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. రకరకాల రీల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో జూన్‌ 11 న ఆ యువకుడు తన సోషల్ మీడియా ఖాతా కోసం రీల్ షూట్ చేయడానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి  ముంబ్రాలోని చాంద్‌నగర్‌ సమీపంలోని బ్రిటీష్‌ కాలం నాటి పంప్‌ హౌస్‌కు అనుసంధానంగా ఉన్న బావి వద్దకు వచ్చాడు. అనంతరం బావి స్టెప్పులేస్తూ.. రీల్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, ప్రమాదశాత్తువు ఆ యువకుడు బావిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదివారం (జూన్ 11) జరిగింది. అయితే.. దాదాపు 32 గంటల తర్వాత వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. 

కేసు గురించి విష్ణునగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పండినాథ్ భలేరావు సమాచారం ఇస్తూ..  బిలాల్ బావిలో పడిపోవడాన్ని చూసిన ఇద్దరు స్నేహితులు సహాయం కోసం సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లారని  తెలిపారు. దీంతో గార్డు విష్ణు నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి వెంటనే వెతుకులాట ప్రారంభించాడు. ముంబ్రాలోని చాంద్‌నగర్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.మృతి సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకునేందుకు దర్యాప్తు చేస్తానని చెప్పారు. పంప్ హౌజ్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. బిలాల్ రీల్ షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడని అతని స్నేహితులు పేర్కొన్నారు. 

32 గంటల తర్వాత లభ్యమైన మృతదేహం 

డోంబివిలి అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ.. మా బృందం బాలుడి మృతదేహం కోసం ఒకరోజుకు పైగా వెతికింది. ఘటన జరిగిన 32 గంటల తర్వాత సోమవారం (జూన్ 12) సాయంత్రం అతడి మృతదేహం లభ్యమైందని తెలిపారు. చాంద్‌నగర్ వాసులు బిలాల్‌ను రీల్ స్టార్‌గా చూశారని పోలీసులు తెలిపారు. ఆయన మరణం అందరినీ కలచివేసింది.

ఈ దుర్ఘటనపై బిలాల్ మామ ఖలీద్ భాయ్ మాట్లాడుతూ.. "బిలాల్ తన హితులతో కలిసి ఠాకూర్లీకి వెళ్తున్నట్లు మాతో చెప్పాడు. రాత్రికి ఇంటికి తిరిగి వస్తాడని అనుకున్నాం. ఆ తర్వాత అతని స్నేహితులు ఈ సంఘటన గురించి చెప్పినప్పుడు, మేము షాక్ అయ్యాము. తన కుటుంబం పడుతున్న బాధను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అతను ఈ లోకంలో లేడని మనం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం." అని వాపోయారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios