Asianet News TeluguAsianet News Telugu

గందరగోళం: ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్

 కరోనా వ్యాక్సిన్ విషయంలో  ప్రధాని మోడీ వాగ్ధానం ఆచరణలో ఆశించిన మేర అమలు కావడం లేదు. వ్యాక్సిన్ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 
 

doing How India's Vaccine Drive Crumbled And Left A Country In Chaos lns
Author
New Delhi, First Published Apr 30, 2021, 3:32 PM IST

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ విషయంలో  ప్రధాని మోడీ వాగ్ధానం ఆచరణలో ఆశించిన మేర అమలు కావడం లేదు. వ్యాక్సిన్ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ఈ ఏడాది జనవరి మాసంలో  ప్రారంభించిన సమయంలో సక్సెస్ కు ఎక్కువ రేటు ఉంది. అయితే ప్రపంచంలోని ఏ దేశంలో కంటే ఎక్కువ డోసులను ఇండియా ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది. అంతేకాదు  గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు, పిల్లలకు టీకాలు వేసే దశాబ్దాల అనుభవం ఉంది.  దేశంలోని ప్రతి మూలకు చేరుకొంటుందని మోడీ ఈ ఏడాది జనవరి 22న ప్రకటించారు.  అంతేకాదు వ్యాక్సిన్లతో ఇండియా చాలా దేశాలకు సహాయం చేస్తోందన్నారు. 

మూడు మాసాల తర్వాత  ఈ వాగ్ధానం ఆచరణలో ఆశించినమేరకు అమలు కావడం లేదు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం వాగ్దానాలు గందరగోళంలో పడిపోయాయి. దేశంలోని 1.3 బిలియన్ల జనాభాలో 2 శాతం మందికంటే తక్కువ మందికి టీకాలు వేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కోసం నిరీక్షిస్తున్నాయి. వ్యాక్సిన్ కేసులతో పెద్ద సంఖ్యలో రోగులు మృత్యువాత పడుతున్నారు. దీంతో  కరోనా కేసులు, మృతులతో ఇండియా రికార్డులు సృష్టిస్తోంది.దేశంలో  తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్ లో భాగమైన ఆరోగ్య సిబ్బందికి వృద్దులకు వ్యాక్సిన్ అందించారు. ఈ ఏడాది మే 1 నుండి  18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 

కేంద్రానికి, రాష్ట్రాలకు సరఫరా చేసే వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసాలు కూడ ఉన్నాయి. ఈ విషయమై విపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ నేతలు కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయమై ట్విట్టర్ వేదికగా కేంద్రం తీరును ఎండగట్టిన విషయం తెలిసిందే.టీకాలను సేకరించుకోవాలని రాష్ట్రాలను కోరేముందు ఈ విషయమై రాష్ట్రాలతో కేంద్రం చర్చించలేదని ఛత్తీస్‌ఘడ్ సీఎం టీఎస్‌ సింగ్ డియో వ్యాఖ్యానించారు.  బహిరంగ మార్కెట్ నుండి  వ్యాక్సిన్ కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు సీఎం.

వ్యాక్సినేషన్ పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలోని బయో సెక్యూరిటీ ప్రోఫెసర్ రైనా మాక్ ఇంటైర్ అన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ వేయడం వల్ల  కొత్త స్ట్రెయిన్స్ నుండి ఒత్తిడి తగ్గే అవకాశం లేకపోలేదన్నారు. ఈ ఏడాది జనవరి 28న ప్రపంచ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్న మోడీ ఇతర దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేసి సహాయం చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలో దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 18,888 గా  ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. 

ప్రపంచంలోని పలు దేశాలు వ్యాక్సిన్ల విషయంలో తమ ప్లాన్లను విజయవంతంగా అమలు చేశారు. ఇండియాలో మాత్రం సాధారణంగా సాగింది. కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మునిగిపోయాయి. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ముడిసరుకులపై అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని సీరం సీఈఓ అదార్ పూనవల్లా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ ఏడాది ఏప్రిల్ 16 న వ్యాక్సిన్ కొరత ప్రారంభమైంది. 

వ్యాక్సిన్ విషయమై రాష్ట్రాలపై  కేంద్రం బారం మోపింది. ఇతర దేశాలకు  వ్యాక్సిన్ల ఎగుమతిని ఇండియా నిలిపివేసింది. మోడీ ప్రభుత్వ కొత్త టీకా ప్లాన్ తెలివైన రాజకీయ కుట్రగా కేరళ ఆర్ధిక మంత్రి థామస్ ఐజాక్ అభిప్రాయపడ్డారు. టీకా విధానం ఎలా పనిచేస్తోందనే దానిపై సమన్వయం లేదా సంప్రదింపులు జరగలేదని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి జల్బీర్ సింగ్ సిద్దూ చెప్పారు. భారతదేశానికి చెందిన రెండు వ్యాక్సిన్ సరఫరాదారులు భారత్ బయోటెక్, సీరం సంస్థలు ఈ ఏడాది జూన్ నాటికి తమ సామర్ధ్యాన్ని పెంచుకొంటాయి. రష్యాకుచెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు  కూడ కేంద్రం అనుమతి ఇచ్చింది.

రాష్ట్రలు వ్యాక్సిన్ల డోసుల కోసం  కేంద్ర ప్రభుత్వం కంటే ఐదు నుండి 8 డాలర్లు ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్రాలు కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించాయి.  భారత్ బయోటెక్  సంస్థ రాష్ట్రాలకు సరఫరా చేసే వ్యాక్సిన్ ధరను రూ. 600కి తగ్గించనున్నట్టుగా ప్రకటించింది. మరోవైపు సీరం సంస్థ కూడ వ్యాక్సిన్ ధరను మరో రూ 100 తగ్గిస్తామని తెలిపింది.మహారాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6500 కోట్లను ఖర్చు చేస్తోందని  ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు. 

ఇండియాతో పాటు కొన్ని దేశాలు వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లో విక్రయించుకొనే వెసులుబాటును కల్పించాయి. ప్రైవేట్ ఆసుపత్రులు మోతాదుకు  మూడు డాలర్ల కు వేయడం ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం ఒక డోసుకు 8 నుండి 16 డాలర్లు వసూలు చేస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్లను ఒకే ధర ఉండాలని మాజీ ఆర్ధిక ముఖ్య  సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. అయితే ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios