Asianet News TeluguAsianet News Telugu

ఈ కుక్కలు కరోనా రోగులను ఇట్టే పట్టేస్తాయి..!

బ్రిటన్ లో కుక్కలకు కరోనా వైరస్ రోగులకు గుర్తించేందుకు శిక్షణ కూడా ఇచ్చేశారు. దాదాపు 90శాతం కరోనా రోగులను ఈ కుక్కలు వెంటనే గుర్తుపట్టేస్తాయి. వారికి కరోనా లక్షణాలు లేకున్నా కూడా.. గుర్తు పట్టేస్తుండటం విశేషం.
 

Dogs Can Be Trained To Detect 90% Covid Cases, Even Asymptomatic: Study
Author
Hyderabad, First Published May 24, 2021, 10:13 AM IST

కరోనా మహమ్మారి మన దేశంలో ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ కొన్ని లక్షల మంది ఈ మహమ్మారి బారినపడుతున్నారు. వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సోకిన చాలా మంది హోం ఐసోలేషన్ లో ఉండకుండా.. బయట తిరుగుతుండటం వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగిపోతోంది. కొందరికేమో.. లక్షణాలు లేకపోవడం వల్ల తాము కరోనా బారిన పడ్డాం అనే విషయాన్ని గుర్తించడం లేదు. దీంతో.. వారికి తెలియకుండానే.. వైరస్ ని వ్యాపింపచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. కరోనా రోగులను గుర్తించడం కూడా కష్టంగానే ఉంది. కరోనా టెస్టు చేయించుకున్న 24గంటలకు గానీ.. రిజల్ట్ రావడం లేదు. ఈ లోపు జరగాల్సిన వ్యాప్తి జరిగిపోతోంది. ఈ కారణాల వల్ల రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే.. ఇలాంటి సమస్యను ఈ కుక్కలు పరిష్కరిస్తాయట. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ కుక్కలు కరోనా రోగులను ఇట్టే పట్టేస్తాయి. లక్షణాలేని వారిని కూడా.. వారిలో వైరస్ ఉంటే చాలు వెంటనే పట్టేస్తాయి.

ఈమేరకు బ్రిటన్ లో కుక్కలకు కరోనా వైరస్ రోగులకు గుర్తించేందుకు శిక్షణ కూడా ఇచ్చేశారు. దాదాపు 90శాతం కరోనా రోగులను ఈ కుక్కలు వెంటనే గుర్తుపట్టేస్తాయి. వారికి కరోనా లక్షణాలు లేకున్నా కూడా.. గుర్తు పట్టేస్తుండటం విశేషం.

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, డర్హామ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఈ పరిశోధన కోసం ఏకగా 500,000 పౌండ్లను బ్రిటన్ కేటాయించింది. నిజానికి.. ఇప్పటికే కుక్కలు క్యాన్సర్‌, మలేరియా వంటి వ్యాధులబారినపడిన వారిని గుర్తిస్తున్నాయి.

అదే నమ్మకంతో ఇప్పుడు కరోనా వైరస్‌ను గుర్తించేందుకు వాటికి శిక్షణ ఇస్తున్నారు పరిశోధకులు. తమ ప్రయత్నం కచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుందన్న నమ్మకం ఉందని మంత్రి జేమ్స్ బెథెల్ చెప్పారు. ఒక కుక్క గంటకు 250మందిని పరీక్షిస్తుందని, ఇది బహిరంగ ప్రదేశాలు, వినామానాశ్రయాల్లో ఎంత ఉపయోగకరంగ ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అంతేగాకుండా.. యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ పరిశోధకులు కూడా కరోనా వ్యాధిని గుర్తించడానికి కుక్కలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

కాగా.. ఇటీవల జరిగిన పరిశోధనల్లో కుక్కలు కొందరు కరోనా రోగులను సులభంగా గుర్తించేశాయట. అలా కుక్కలు గుర్తించిన వారికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో.. ఈ కుక్కలతో మరింత ఎక్కువ రోగులను గుర్తించాలని వారు అనుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios