నిందితుడిని ఏర్నాకులానికి చెందిన యూసూఫ్ గా గుర్తించారు. అతను ఆ కారుకి యజమాని కాగా.. కుక్కని లాక్కెళ్లే సమయంలో కారు డ్రైవ్ చేసింది కూడా అతనే కావడం గమనార్హం.
ఓ వ్యక్తి కారుకి కుక్కని కట్టి.. లాక్కెళ్లాడు. ఈ దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. సదరు డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఓ 62ఏళ్ల వ్యక్తి... తన కారుకి కుక్కని కట్టి లాక్కెళ్లాడు. కాగా.. దీనిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వీడియో కాస్త వైరల్ గా మారింది.
దీంతో.. పోలీసులు ఈ విషయంలో కలగజేసుకొని.. సదరు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఏర్నాకులానికి చెందిన యూసూఫ్ గా గుర్తించారు. అతను ఆ కారుకి యజమాని కాగా.. కుక్కని లాక్కెళ్లే సమయంలో కారు డ్రైవ్ చేసింది కూడా అతనే కావడం గమనార్హం.
ఆ కుక్క అతను పెంచుకునేది కాదని పోలీసుల దర్యాప్తు లో తేలింది. ఆ కుక్క అతని ఇంటికి సమీపంలో ఉంటుందని.. అది చేస్తున్న న్యూసెన్స్ తట్టుకోలేక.. దానిని వేరే ప్రాంతంలో వదిలిపెట్టాలనే ఉద్దేశంతో అతను ఆ పనిచేసినట్లు తెలిసింది. అయితే.. కుక్కను అలా హింసించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 12, 2020, 9:58 AM IST