మనుషుల అంత్యక్రియల కోసం.... కుక్కల స్మశాన వాటికలు: ఢిల్లీలో దారుణ పరిస్ధితులు

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ మరణ మృదంగం మోగిస్తున్న సంగతి తెలిసిదే. దీంతో స్మశానాలు నిర్విరామంగా మండుతున్నాయి. అంత్యక్రియల కోసం మృతుల బంధువులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు

Dog crematorium to be used for human funerals in Delhi ksp

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ మరణ మృదంగం మోగిస్తున్న సంగతి తెలిసిదే. దీంతో స్మశానాలు నిర్విరామంగా మండుతున్నాయి. అంత్యక్రియల కోసం మృతుల బంధువులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీని నివారించేందుకు గాను ఢిల్లీ నగరపాలక సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. శునకాల స్మశానాన్ని మానవ మృతదేహాల అంత్యక్రియలకు వినియోగించాలని నిర్ణయించింది. 

ఢిల్లీలో కరోనా మృతులకు అంత్యక్రియల కోసం శ్మశానవాటికల్లో 20 గంటలపాటు క్యూలైన్  లో వేచి ఉండాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరైతే మృతదేహాలను కార్లు, అంబులెన్సుల్లో వేసుకొని అంత్యక్రియల కోసం నగరంలోని శ్మశానవాటికల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా క్యూలైన్‌లు మాత్రం తప్పడం లేదు.

Also Read:దేశంలో విస్తరిస్తున్న కరోనా.. ఒక్కరోజే నాలుగు లక్షలకు చేరువలో కొత్త కేసులు.. 3,645 మంది మృతి...

కరోనా మృతులకే కాదు సాధారణంగా చనిపోయినవారికి కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బందులు  ఎదురవుతున్నాయి. నగరంలోని ఒక శ్మశానవాటికలో మంగళవారం ఒక్కరోజే 50 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

నిబంధనల ప్రకారం కరోనా రోగి చనిపోతే జిల్లా అధికార యంత్రాంగం ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి సిబ్బంది ద్వారా అంత్యక్రియలు నిర్వహించాలి. అయితే మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో బంధువులు, కుటుంబసభ్యులే మృతదేహాలను తమ వాహనాల్లో తీసుకెళ్తున్నారు. దీనివల్ల  కరోనా మరింత వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios