ప్రపంచంలో అప్పుడప్పుడూ మనం ఎక్కడా కనీ వినీ ఎరగని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటినే మనం వింత అని అంటూ ఉంటాం. ఇలాంటి వింత సంఘటన ఒకటి రాజస్థాన్ లో చోటుచేసుకుంది. 8ఏళ్ల పిల్లాడి కడుపులో మూడుకేజీల పిండం ఉంది.కాగా.. వైద్యులు ఎంతో శ్రమించి ఆ పిండాన్ని బయటకు తీశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని బికనీర్ లో ఎనిమిదేళ్ల పిల్లాడి శరీరంలో పిండం ఉంది. బాలుడు పెరుగుతున్న కొద్ది  పొట్ట పెద్దగా పెరుగుతోంది. గమనించిన తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా...అతని కడుపులో పిండం ఉన్నట్లు గుర్తించారు. చాలా మందికి కవలలు పుడుతూ ఉంటారు కదా. అలాంటి సమయంలోనే సరైన పోషకాహారం అందకపోవడం, జన్యుపరమైన మార్పుల కారణంగా.. తల్లికడుపులో పెరగాల్సిన ఓ పిండం.. తన సోదరుడి కడుపులోకి చేరింది.

దాంతో.. పిల్లాడు పెరుగుతున్న కొద్దీ.. కడుపులో పిండం కూడా పెరుగుతూ వచ్చింది. అయితే.. ఆ పిండం నిజానికి పూర్తిగా స్థాయి బిడ్డగా లేదట. కేవలం జుట్టు, కపాలం, కాళ్లు మాత్రమే ఉన్నాయట. అయితే.. రక్తనాణాలు ఉండటంతో రక్త ప్రసరణ జరిగి.. పిండం పెద్దదిగా అయినట్లు గుర్తించారు. ఆ బాలుడి కడుపులోని పిండాన్ని పూర్తిస్థాయిలో తొలగించారు.

ఇటీవల నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా కూడా ఈ కాన్సెప్టే. అందులో హీరో ఎడమచేతిలో కవల సోదరుడి లక్షణాలు ఉంటే.. ఈ బాలుడికి ఇలా జరిగింది.  ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు.