చాయ్ లేట్‌గా ఇచ్చారని ఆపరేషన్ చేయకుండానే నలుగురు పేషెంట్లను వదిలి థియేటర్ నుంచి వెళ్లిపోయిన డాక్టర్

నాగ్‌పూర్‌కు చెందిన ఓ వైద్యుడు చాయ్ లేట్ గా ఇచ్చారని ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్లను వదిలిపెట్టి ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు. దీంతో మరో వైద్యుడిని అరేంజ్ చేయాల్సి వచ్చింది. 
 

doctor left operation theatre for delaying tea leaving tubectomy operation for remaining four patients kms

ముంబయి: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. చాయ్ లేటుగా తెచ్చారని ఓ వైద్యుడు నలుగురు పేషెంట్లను ఆపరేషన్ థియేటర్‌లోనే వదిలి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆ నలుగురు పేషెంట్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. జిల్లా వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో మరో వైద్యుడిని ఆపరేషన్ కోసం పంపించారు. 

నాగ్‌పూర్‌లోని ఖాత్‌లో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది మంది మహిళలు ట్యూబెక్టమీ కోసం వచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం వారు రాగా.. నలుగురికి డాక్టర్ ఆపరేషన్ చేశారు. అప్పటికే చాయ్ కావాలని డాక్టర్ అడిగారు. ఆ చాయ్ కొంచెం ఆలస్యమైంది. దీంతో ఆ వైద్యుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వెళ్లిపోయారు. 

Also Read: ప్రధానమంత్రి మోడీకి వైఎస్ షర్మిల లేఖ.. దేని గురించి అంటే?

మిగిలిన నలుగురు పేషెంట్లకు అప్పటికే అనస్థీషియా వేశారు. వారు మత్తులోనే ఉన్నారు. వారికి ఆపరేషన్ చేయకుండా డాక్టర్ భాలవి చాయ్ టైమ్ కు రాలేదని వెళ్లిపోయారు. దీంతో ఆ నలుగురు పేషెంట్ల కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. ఈ ఘటనను జిల్లా పరిషద్ వెంటనే పరిగణనలోకి తీసుకుంది.మరో వైద్యుడిని అక్కడికి పంపింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తు జరపడానికి వెంటనే ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios