బ్రేకప్ తో డిప్రెషన్.. మెర్సిడెస్ కారుకు నిప్పుపెట్టిన డాక్టర్..
కారుకు నిప్పంటించుకుని తర్వాత అందులోనే.. కూర్చుని వైద్యుడు తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చెన్నై : బ్రేకప్ అయిందని కారుకు నిప్పంటించాడో వ్యక్తి. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. 29 ఏళ్ల వైద్యుడు తన మెర్సిడెస్ కారుకు నిప్పంటించిన ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగింది. కొన్నేళ్ల క్రితం కాంచీపురంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మాజీ క్లాస్‌మేట్ అయిన తన ప్రియురాలితో బ్రేకప్ అవ్వడంతో డాక్టర్ డిప్రెషన్‌లో ఉన్నారని పరిశోధకులు చెబుతున్నారు. అతను తన డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి పునరావాస చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
కారుకు నిప్పంటించిన తర్వాత వాహనం లోపల కూర్చున్న వైద్యుడు తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరూ రెగ్యులర్ గా గడిపే చెరువు దగ్గర అదే ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. కొంతసేపటి వరకు మంటల్లోంచి బయటకు రాలేదు. ఆ తరువాత ఊపిరాడక బయటపడ్డాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కారు పూర్తిగా దగ్ధమైంది. సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ద విమానాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
కారులో మహిళ అతనితో లేదని పోలీసులు తెలిపారు. "ఆమె నెం.ను నంబర్‌ను గుర్తించాం. ఆమె సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్నాం. ఆమె అతనితో లేదు" అని పోలీసు అధికారి తెలిపారు. డాక్టర్ కుటుంబం తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉంది. అతని తండ్రి ఈ ప్రాంతంలో సుప్రసిద్ధ సంప్రదాయ బోన్ సెట్టర్.