కవల పిల్లలపై శారీరకంగా దాడి చేశారు ఓ డాక్టర్ దంపతులు. సదరు డాక్టర్ వలీల్ ఇస్లాం, డాక్టర్ సంగీతా దత్తాలను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపినట్లు గౌహతి పోలీసులు తెలిపారు.

అస్సాం : మూడేళ్ల వయసున్న కవల సోదరీమణులను తమ ఇంట్లో బందీలుగా ఉంచారు ఓ డాక్టర్ దంపతులు. వారిమీద కొన్ని నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నారు. చిన్నారులని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ ఆరోపణలపై ఫిర్యాదులు అందడంతో గౌహతికి చెందిన ఓ డాక్టర్ దంపతులను మే 5న పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ డాక్టర్ దంపతుల్లో ఒకరు డాక్టర్ వలియుల్ ఇస్లాం సర్జన్ కాగా, డాక్టర్ సంగీత దత్తా, ఒక మానసిక వైద్యురాలు. వీరిద్దరిని పోలీసు కస్టడీకి పంపించారు. వీరితో పాటు వారింట్లో సహాయకుడిగా ఉంటున్న ఓ వ్యక్తిని జ్యుడీషియల్ కస్టడీకి పంపామని, ఈ జంటపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద వీరిమీద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇద్దరు చిన్నారుల్లో ఒక బాలిక శరీరంపై పలు గాయాల గుర్తులు ఉన్నాయి. వైద్య పరీక్షల్లో ఆమె ప్రైవేట్ పార్ట్‌లను సిగరెట్‌తో కాల్చినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. గౌహతి కమీషనర్ ఆఫ్ పోలీస్, దిగంత బరాహ్ మాట్లాడుతూ, “మైనర్ బాలికలను డాక్టర్ దంపతుల నివాసమైన రోమా ఎన్‌క్లేవ్‌లోని నాల్గవ అంతస్తులో బందీలుగా ఉంచారు. 3 ఏళ్ల బాలిక ప్రైవేట్ భాగాలపై గాయాలు, కాలిన గుర్తులు ఉన్నాయి. ఆమె శరీరంలోని అనేక భాగాలలో గాయాలు ఉన్నాయి. వైద్య పరీక్షల్లో ఆమె ప్రైవేట్ పార్ట్‌లను సిగరెట్‌తో కాల్చినట్లు తేలింది.

సొంత ఖర్చులతో బెయిల్ ఇప్పించి.. బయటికి వచ్చాక కాల్చి చంపాడు.. ఎందుకంటే...

“వారి పనిమనిషి లక్ష్మీనాథ్‌ కూడా వీరికి సాయం చేశాడు. అతనితో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని ఆదివారం గౌహతిలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు దంపతులను ఐదు రోజుల పోలీసు కస్టడీకి, పనిమనిషి లక్ష్మి నాథ్‌ను ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది’ ఈ జంటపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

కేసు దర్యాప్తులో ఉందని, అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి), ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని బారాహ్ చెప్పారు.

కవలల తల్లిదండ్రులు ఎవరనేది ఇంకా తెలియలేదు. దంపతుల ఇంట్లో వారు ఎలా చిక్కుకుపోయారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. “పిల్లలను ఇంత చిత్రహింసలు పెట్టడానికి ప్రధాన ఉద్దేశ్యం ఏంటో ఇంకా తెలియలేదు. నిజానిజాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని’ పోలీసులు తెలిపారు.

బాలల హక్కుల కార్యకర్త మిగ్యుల్ దాస్ క్యూయా నిందితుడి ఇంట్లో ఏదో తప్పుగా జరుగుతుందని అనుమానించారు. మార్చిలో, కొంతమంది ఇన్‌ఫార్మర్లు దాస్‌తో మాట్లాడుతూ, నిందితులు పిల్లలలో ఒకరిని మండే వేడిలో టెర్రస్‌పై స్తంభానికి కట్టి ఉంచారని చెప్పారు. చివరకు ఇన్‌ఫార్మర్‌లలో ఒకరు తమ వద్దకు వచ్చి జరిగిన సంఘటనను నివేదించడంతో పోలీసులు ఈ నెలలో కేసును తీసుకున్నారు.