Asianet News TeluguAsianet News Telugu

భారతదేశపు తొలి గ్రామం 'మ‌నా' గురించిన ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

Uttarakhand's Mana: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉత్తరాఖండ్ లోని 'మనా' గ్రామ ప్రవేశ ద్వారం వద్ద 'భారతదేశపు మొదటి గ్రామం' అని రాసి ఉన్న సైన్ బోర్డును కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఏర్పాటు చేసింది. ఇది చమోలి జిల్లాలోని బద్రీనాథ్ సమీపంలో ఉన్న ఒక పర్యాటక కేంద్రం. దీని ప్ర‌త్యేక‌త‌లేంటో తెలుసా..? 
 

Do you know these things about India's first village Uttarakhand's 'Mana'? RMA
Author
First Published Apr 25, 2023, 7:31 PM IST

India's First Village Mana: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉత్తరాఖండ్ లోని 'మనా' గ్రామ ప్రవేశ ద్వారం వద్ద 'భారతదేశపు మొదటి గ్రామం' అని రాసి ఉన్న సైన్ బోర్డును కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఏర్పాటు చేసింది. ఇది చమోలి జిల్లాలోని బద్రీనాథ్ సమీపంలో ఉన్న ఒక పర్యాటక కేంద్రం.

  • మనా హిమాలయాలలో భారతదేశం.. టిబెట్ /చైనా సరిహద్దులో ఉన్న భారతీయ గ్రామం. ఇది చమోలీ జిల్లాలో ఉంది. దీనిని ఉత్తరాఖండ్ ప్రభుత్వం "టూరిజం విలేజ్"గా గుర్తించింది.
  • మ‌నా బద్రీనాథ్ పట్టణానికి కేవలం 3 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న ఉత్తమ పర్యాటక ఆకర్షణీయ‌మైన ప్రాంతాల్లో ఒక‌టిగా గుర్తింపు ఉంది. ఈ గ్రామం సరస్వతీ నది ఒడ్డున ఉంది. ఇది సుమారు 3219 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గ్రామం చుట్టూ హిమాలయ కొండలు ఉన్నాయి.

హిందూ పురాణాలైన మహాభారతం ఆనవాళ్లు మనాలో కనిపిస్తాయి. పాండవులు స్వర్గానికి వెళ్ళే సమయంలో మ‌నా గుండా వెళ్ళారని నమ్ముతారు. సరస్వతీ నది సమీపంలో భీముడు (పాండవులలో ఐదుగురు సోదరులలో ఒకరు) నిర్మించిన ప్రసిద్ధ రాతి వంతెనను 'భీమ్ పూల్' అని పిలుస్తారు. ఇది సరస్వతీ నదిపై వంతెనగా ఏర్పడిన ఒక పెద్ద రాయిగా పేర్కొంటారు. 

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన 'వైబ్రెంట్ విలేజ్' పథకంలో భాగంగా ఈ పేరు మార్పు జరిగింది. 19 జిల్లాలు, నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 46 సరిహద్దు బ్లాకుల్లోని గ్రామాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్ ప్రకారం, మనా సముద్ర మట్టానికి 3219 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది సరస్వతీ నది ఒడ్డున ఉంది.
  • మనా గ్రామంలో భోటియాలు (మంగోల్ తెగ) నివసిస్తున్నారని వెబ్ సైట్ తెలిపింది.
  • మన గ్రామాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం మే నుండి నవంబర్ ప్రారంభం వరకు ఉంటుంది.  ఆ తర్వాత ఏప్రిల్ వరకు భారీ హిమపాతం కారణంగా ఈ ప్రాంతం చేరుకోలేనిదిగా ఉంటుంద‌ని స‌మాచారం. 
  • గత ఏడాది అక్టోబర్ లో ఈ గ్రామాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని సరిహద్దు గ్రామాలు తమ మొదటి గ్రామాలనీ, సాధారణంగా పిలిచే విధంగా చివరి గ్రామాలు కావని పేర్కొన్నారు.
  • హిందూ పురాణాలైన మహాభారతం ఆనవాళ్లు మనాలో కనిపిస్తాయి. పాండవులు స్వర్గానికి వెళ్ళే సమయంలో మ‌నా గుండా వెళ్ళారని నమ్ముతారు. సరస్వతీ నది సమీపంలో భీముడు (పాండవులలో ఐదుగురు సోదరులలో ఒకరు) నిర్మించిన ప్రసిద్ధ రాతి వంతెనను 'భీమ్ పూల్' అని పిలుస్తారు. ఇది సరస్వతీ నదిపై వంతెనగా ఏర్పడిన ఒక పెద్ద రాయిగా పేర్కొంటారు. 
Follow Us:
Download App:
  • android
  • ios