దేశప్రజలంతా హర్ ఘర్ తిరంగాలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే, దీనికి సంబంధించి సర్టిఫికెట్ కూడా తీసుకోవచ్చని మీకు తెలుసా? అదెలా తీసుకోవచ్చో ఇక్కడ చూడండి.
ఢిల్లీ : దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను దేశ ప్రజలంతా అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగానే ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించటం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అందరిని భాగం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం harghar tiranga పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.
ప్రజలు తమ తమ ఇళ్ల పై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జాతీయ జెండాలను ప్రతి ఇంటికి పంచి పెట్టారు. ప్రజలు కూడా రెట్టించిన ఉత్సాహంతో తమ ఇళ్ళ మీద జాతీయ జెండాను రెపరెపలాడించారు. తర్వాత తమ సోషల్ మీడియా సైట్లలో సర్టిఫికెట్ను షేర్ చేస్తున్నారు. చాలామంది ఇది గమనించినా... ఈ సర్టిఫికెట్ ను ఎలా పొందాలో తెలియదు. ఆ సర్టిఫికెట్ ఎలా పొందాలో మీ కోసం..
Independence Day 2022 : వినూత్న రీతిలో దేశభక్తి చాటిన కర్నూల్ వాసి కల్యాణ్....
- ముందుగా వెబ్ బ్రౌజర్ లో harghartiranga.comను ఓపెన్ చేయాలి.
- తర్వాత ‘pin a flag’ సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వెబ్సైట్ లొకేషన్ యాక్సెస్ అడుగుతోంది. దానికి అనుమతించాలి.
- ప్రొఫైల్ పిక్ ను సెట్ చేసిన తర్వాత మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- మీరు జెండా ఆవిష్కరించిన ఫోటోను అప్లోడ్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కాలి.
- ఆ తర్వాత మ్యాప్ లో మీ లొకేషన్ ను సరిగా సెట్ చేసి పిన్ ఏ ఫ్లాగ్ మీద క్లిక్ చేయాలి.
- చివరగా మీ సర్టిఫికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
