Asianet News TeluguAsianet News Telugu

Water warriors: జలం లేనిదే జీవం లేదు.. అలాంటి నీటి సంరక్షణకు కృషి చేస్తున్న ఈ యోధుల గురించి తెలుసా..?

భూమి మీద ప్రతి నీటి బొట్టు చాలా విలువైనది. నీరు లేకపోతే జీవం లేదు. పంటలు పండించడాని, ప్రకృతి పచ్చగా కనిపించడానికి నీరే కారణం. కానీ జనాల నిరక్ష్యం వల్ల భూగర్బ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. 

do you know about the Water Warriors of India they Will Inspire You
Author
First Published Aug 5, 2022, 2:55 PM IST

భూమి మీద ప్రతి నీటి బొట్టు చాలా విలువైనది. నీరు లేకపోతే జీవం లేదు. పంటలు పండించడాని, ప్రకృతి పచ్చగా కనిపించడానికి నీరే కారణం. అలాంటి నీటి ప్రాముఖ్యతను చాటిచెప్పేలా ప్రతి ఏడాది మార్చి 22న ప్ర‌పంచ జ‌ల దినోత్స‌వం జరుపుకుంటున్నారు. కానీ జనాల నిరక్ష్యం వల్ల భూగర్బ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నిత్యం పెద్ద మొత్తంలో నీటిని వృథా చేస్తుంటారు. మరోవైపు కొన్ని చోట్ల నీరు దొరక్క  ఇబ్బందలు పడేవారు కూడా ఉన్నారు. కొందరైతే తాగునీటి కోసం వేలాది మైళ్లు ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వినియోగించుకోవాలి. భవిష్యత్తు తరాలు నీటి ఎద్దడి వంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే.. నీటిని వృథాగా పోనివ్వకూడదు. 

అందుకే నీటి సంరక్షణ కోసం తమ వంతు కృషి చేయడానికి దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. వీరు నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, బావులు నిర్మించడం, చెక్ డ్యామ్‌లు నిర్మించడం వంటివి చేస్తున్నారు. అలా దేశంలో వాటర్ వారియర్స్‌గా గుర్తింపు పొందినవారిలో కొందరి గురించి తెలుసుకోండి..

రాజేంద్ర సింగ్.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన రాజేంద్ర సింగ్ 'ది వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా ప్రసిద్ధి చెందారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి పునరుద్ధరణ ఆయన చేసిన ప్రయత్నాలకు విస్తృతమైన గుర్తింపుపొందారు. అనేక ప్రశంసలు అందుకున్నారు. రాజస్థాన్‌లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చేరుకున్నప్పుడు.. అక్కడి ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కంటే ఎక్కువ నీరు అవసరమని ఆయన గ్రహించారు. అక్కడి గ్రామస్థులతో కలిసి జోహాడ్స్ అని పిలువబడే మట్టి ఆనకట్టలను నిర్మించడం ప్రారంభించారు. ఇది వర్షపు నీటిని సేకరించే సంప్రదాయ సాంకేతికత. రాజస్తాన్‌లో దాదాపు 8,600 జోహాద్‌లు, ఇతర నిర్మాణాలు నీటిని సేకరించి..రాజస్థాన్ అంతటా 1,000 గ్రామాలకు పైగా నీటిని అందిస్తున్నాయి. అంతటితో ఆగకుండా దేశవ్యాప్తంగా నీటి పరిరక్షణకు అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. 

నీటి నిర్వహణ, రిరక్షణలో తాను చేసిన ప్రయత్నాలకు రాజేంద్ర సింగ్‌.. 2001లో మెగసెసే అవార్డును, 2015లో స్టాక్‌హోమ్ వాటర్ ప్రైజ్‌ను  గెలుచుకున్నారు. అతను తన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలకు 'వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరుపొందారు. ఆయన పేరు మీద Jal Purush Ki Kahani డాక్యూమెంటరీ కూడా రూపొందించారు. 

అయితే రాజేంద్ర సింగ్ నదుల అనుసంధాన్ని వ్యతిరేకిస్తున్నారు. భారత్‌లో నీటి సమస్యకు నదుల అనుసంధానం పరిష్కారం కాదని ఆయన చెబుతున్నారు. ప్రతి వర్షపు చినుకును ఒడిసిపట్టి సంరక్షించగలిగితే.. భూమి నీటితో నిండుతుంది. కరువు, వరదల సమస్యలు తీరుతాయని ఆయన అంటున్నారు. 


అయ్యప్ప మసాగి.. కర్ణాటకకు చెందిన అయ్యప్ప మసాగి వేలాది మంది వర్షపు నీటి సంరక్షణ, నీటి సంరక్షణను ఆచరించేలా చేయడం ద్వారా వారి జీవితాలను మార్చారు. ఉత్తర కర్ణాటకలోని కరువు పీడిత ప్రాంతంలో పుట్టిన అయ్యప్పకు.. నీటి విలువ గురించి చిన్న తనలోనే తెలుసు. తన తల్లి ఎండకాల వచ్చిందంటే.. తెల్లవారుజామున 3 గంటలకు వాగు నుండి నీరు తెచ్చేది. ఆలస్యంగా వెళితే నీరు దొరికేది కాదు. దీంతో నీటి విలువ ఏమిటో ఆయన చిన్న తనంలోనే తెలుసుకన్నారు. ఇక, కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేసిన వ్యవసాయం చేయాలనే కలను నేరవేర్చుకోవాలని అనుకున్నారు. 

ఈ క్రమంలోనే ఒక గ్రామంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. తొలుత మూడేళ్లు వర్షాలు బాగానే పడ్డాయి. పంట కూడా బాగా వచ్చింది. ఆ తర్వాత మూడేళ్లు వరుసగా కరువు రావడంతో.. పంటలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఇంట్లో వాళ్ల నుంచి మాటలు ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో పంటలు, నీటిని జాగ్రత్తగా వినియోగించుకునేలా మెలుకువలు నేర్చుకున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేలా ప్రయత్నాలు ప్రారంభించారు. వర్షపు నీరు ఎక్కువగా భూమిలో ఇంకేలా చేయాలని చూశాడు. కందకాలు తవ్వించి పరిసరాల్లో కురిసి వాన నీటిని అటువైపు మళ్లించారు. అలాంటి ప్రాంతాల్లో బోరు వేస్తే ఫలితం ఉంటుందని భావించారు. సంవత్సరాల పరిశోధన తర్వాత విజయం సాధించారు. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాల వారు కూడా పాటించడం మొదలు పెట్టారు. 

అయ్యప్ప పరిశ్రమలు, గృహాల కోసం నీటి ప్రణాళిక కోసం కన్సల్టెంట్‌గా పనిచేస్తారు. అయితే ఆయన ప్రధాన లక్ష్యం రైతుల నీటి వినియోగాన్ని మెరుగుపరచడం. ఇందుకోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకు చేతనైన రీతిలో ప్రచారం చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios