UP Assembly Election 2022: ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావాలో? లేదా మరొక కిమ్ జాంగ్-ఉన్ (ఉత్తర కొరియా) లాంటి పరిస్థితి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ అన్నారు.
UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సంయుక్త కిసాన్ మోర్చా ఓ మిషన్ ను ఏర్పాటు చేపడుతున్నట్టు ప్రకటించింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రచారం నిర్వహిస్తామని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు అడ్డుకుంటామని రైతు సంఘాలు నేతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో SKM నాయకులు రాకేష్ టికాయత్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తవించారు.
బీజేపీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేస్తూ.. ఓటర్లను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావాలో? లేదా మరొక కిమ్ జాంగ్-ఉన్ (ఉత్తర కొరియా) లాంటి పరిస్థితి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని, ఏ రాష్ట్రంలోనూ నియంతృత్వ ప్రభుత్వం వద్దని రాకేశ్ టికాయత్ అన్నారు. ప్రజలు తమ ఓటును విజ్ఞతతో ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ముజఫర్‌నగర్‌లో 2013 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, ఇక్కడ శాంతిభద్రతలు నెలకొని ఉన్నాయని, అందుకే ఈసారి ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉంటాయని రాకేష్ టికైత్ అన్నారు. ఈ తరుణంలో 2013లో ముజఫర్‌నగర్ జిల్లాలో చెలరేగిన మతపరమైన అల్లర్లను ప్రస్తావించారు.
గత వారం, తన స్వస్థలమైన ముజఫర్‌నగర్‌లో బిజెపి పోలరైజింగ్ ప్రచారాన్ని నిర్వహిస్తోందని ఆరోపించాడు. ముజఫర్‌నగర్ "హిందూ-ముస్లింమ్యాచ్‌లకు స్టేడియం కాదని అన్నారు. ఇక్కడ హిందూ, ముస్లిం, జిన్నా, మతం గురించి మాట్లాడే వారి ఓట్లు పోతాయని, ముజఫర్‌నగర్ హిందూ-ముస్లిం మ్యాచ్‌లకు స్టేడియం కాదని రాకేష్ టికైత్ చేశారు.
ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవుతున్నాయని, ఇదే పెద్ద విజయమని, ఫలితం అందరికీ కనిపిస్తోందని అన్నారు. అంతకుముందు, మతతత్వ ప్రాతిపదికన ఓటు వేయవద్దని ఓటర్లకు సూచించారు. అభివృద్ధి, కరెంటు, నీరు వంటి మౌలిక సదుపాయాలపై రైతులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇక్కడ పాకిస్తాన్, జిన్నా గురించి మాట్లాడేవారి కన్న స్థానిక సమస్యల గురించి మాట్లాడేవారికి ప్రజలు అనుకూలంగా ఉంటారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో 11 నెలల పాటు జరిగిన రైతుల నిరసనలో రాకేశ్ టికాయిత్ కీలక పాత్ర పోషించారు. చట్టాలను గత నవంబర్‌లో ఉపసంహరించు కుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో నిరసన విరమించారు.
