భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు నిత్యం పెద్ద సంఖ్యల కేసులను అత్యవసర జాబితాను కోరుతుంటారనే సంగతి  తెలిసిందే. దీంతో ప్రధాన న్యాయమూర్తి కోర్టు తరచుగా న్యాయవాదులతో నిండి ఉంటుంది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు నిత్యం పెద్ద సంఖ్యల కేసులను అత్యవసర జాబితాను కోరుతుంటారనే సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన న్యాయమూర్తి కోర్టు తరచుగా న్యాయవాదులతో నిండి ఉంటుంది. కేసుల ప్రస్తావన సమయంలో ప్రధాన న్యాయమూర్తి లాయర్లతో మాట్లాడేటప్పుడు చాలా మృదువుగా మాట్లాడతారు. అయితే మంగళవారం ఓ కేసు విచారణకు ముందస్తు తేదీని పొందడానికి ప్రయత్నించిన లాయర్‌ తీరుపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా అధికారంతో చెలగాటమాడవద్దు’’ అని లాయర్‌ను సీజేఐ హెచ్చరించారు. 

అసలేం జరిగిందంటే.. ముందస్తు తేదీని పొందడానికి న్యాయవాది మరొక బెంచ్ ముందు కేసును ప్రస్తావించాలని కోరారు. అయితే ఆ కేసును ఇప్పటికే సీజేఐ ఏప్రిల్ 17కి జాబితా చేశారు. ఈ విషయంలో లాయర్ ముందస్తు విచారణ కోసం కోర్టును అభ్యర్థించారు. ‘‘అనుమతి ఉంటే నేను మరొక బెంచ్ ముందు ప్రస్తావించగలను’’ అని లాయర్ చెప్పారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ‘‘మీ తేదీ ఏప్రిల్ 17న అని.. 14వ తేదీని పొందడానికి మీరు దానిని మరొక బెంచ్ ముందు పేర్కొనాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించింది. దీని తరువాత లాయర్ మాట్లాడుతూ.. ఇదే అంశాన్ని నిన్న కోర్టు విచారించిందని, కొన్నితాజా విషయాలను కూడా ప్రస్తావించినట్లు చెప్పారు.

ఈ క్రమంలోనే స్పందించి సీజేఐ.. తనతో ట్రిక్స్ ప్లే చేయవద్దని అన్నారు. “మేము మీకు 17వ తేదీ ఇస్తున్నాము. 17న తెరపైకి రానుంది. ముందస్తు తేదీ కోసం వేరే చోట ప్రస్తావించవద్దు’’ సీజేఐ అన్నారు. తన సమర్పణలు ప్రధాన న్యాయమూర్తికి కోపం తెప్పించాయని అర్థం చేసుకున్న లాయర్.. విచారం వ్యక్తం చేశారు. తన సమర్పలకు క్షమించాలని చెప్పారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి లాయర్‌తో.. “అవును. మీరు క్షమించబడ్డారు. కానీ నా అధికారంతో చెలగాటమాడకండి’’ అని పేర్కొన్నారు.