Asianet News TeluguAsianet News Telugu

మనుస్మృతి పుస్తకానికి నిప్పు పెట్టి... దానితో సిగరెట్ వెలిగించిన మహిళ

పురాతన హిందూ ధర్మశాస్త్రాలలో అది ఒకటిట. అలాంటి పుస్తకానికి నిప్పు పెట్టి... దానితో సిగరెట్ వెలిగించడం ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.
 

Do not eat Chcken or smoke, Woman who lit Cigarette with burning Manusmriti
Author
First Published Mar 7, 2023, 9:43 AM IST

ఓ మహిళ వంట చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియోలో మహిళ చికెన్ వండుతోంది. అందులో వింతేముంది...? అందరూ ఇంట్లో చికెన్ వండుతూనే ఉంటారు.. ఈమె వీడియో వైరల్ ఎందుకు అయ్యింది అనే సందేహం మీకు కలగొచ్చు. వీడియోలో మహిళ చికెన్  వండుతూ... ఆ పొయ్యి మంటతో పుస్తకాన్ని కాల్చి.. ఆ మంటతో ఆమె సిగరెట్ వెలిగించడం గమనార్హం. దీంతో... వీడియో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఉన్న మహిళను ప్రియ దాస్(27) గా గుర్తించారు. ఆమె రాష్ట్రీయ జనతా దల్(ఆర్జేడీ) మహిళా విభాగం రాష్ట్రసెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఆమె నిప్పు అంటించిన పుస్తకతం సాధారణైనది కాదు. మనుస్మృతి. పురాతన హిందూ ధర్మశాస్త్రాలలో అది ఒకటిట. అలాంటి పుస్తకానికి నిప్పు పెట్టి... దానితో సిగరెట్ వెలిగించడం ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.


అయితే ఆమె మనుస్మృతిని ఎందుకు తగలబెట్టింది? అనే విషయాన్ని ఆమె మీడియాకు వివరించడం గమనార్హం. పుస్తకం ప్రకారం, ఒక మహిళ మద్యం సేవిస్తే, ఆమెను వివిధ రకాలుగా శిక్షించవచ్చు. అయితే ఆమెను శిక్షించే ముందు ఆమె కులాన్ని నిర్ధారించాలి అని ఉందట. దానిని నిరసిస్తూ ఆమె అలా చేయడం గమనార్హం. 

 


"నేను మాంసాహారం తినను. నేను ధూమపానం చేయను" అని ఆమె చెప్పింది, వీడియోలో తన చర్యలు పుస్తకంపై తన నిరసనను నమోదు చేయడం కోసం మాత్రమే అని ఆమె ఎత్తి చూపింది.

 “మనుస్మృతిని తగులబెట్టడం ఒక చర్య - తాత్కాలిక సంఘటన. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా కాలం క్రితమే దీని దహనానికి పునాది వేశారు. ” అని ఆమె చెప్పడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios