ఎక్సైజ్ అధికారుల్లో భయాందోళన కలిగించే వాతావరణాన్ని సృష్టించవద్దని సుప్రీం కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కు మొట్టికాయలు వేసింది. 

న్యూఢిల్లీ : భయానక వాతావరణం సృష్టించవద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. మద్యం అక్రమాల కేసులో పలువురు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు బెదిరింపులకు గురవుతున్నామని ఫిర్యాదు చేశారని, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను ఇరికించారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తెలియజేయడంతో ఈ మేరకు తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌లు ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఏ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, విఎంజెడ్ ఛాంబర్స్ ద్వారా, రాష్ట్రాన్ని పార్టీ ప్రతివాదిగా ఇంప్లీడ్ చేయడానికి అనుమతించాలని ఇంప్లీడ్‌మెంట్ కోసం ఒక దరఖాస్తును దాఖలు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమను, తమ కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామని బెదిరిస్తోందని "సిఎంను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని" పలువురు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరోపించారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆరోపించింది.

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ అత్యున్నత న్యాయస్థానంలో మాట్లాడుతూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎక్సైజ్‌ అధికారులను బెదిరిస్తోంది. ఇది షాకింగ్ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్ అని ఆయన అన్నారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు ఆరోపణలను తిప్పికొడుతూ.. మద్యం అక్రమాలపై దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోందన్నారు. 

బెంగుళూరా.. మజాకా.. ఉబర్ ఆటో బుక్ చేస్తే.. వెయిటింగ్ టైం చూసి షాక్.. వైరల్ అవుతున్న పోస్ట్...

"తమపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును సవాలు చేస్తూ కొందరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇంప్లీడ్ కోసం దరఖాస్తును దాఖలు చేసింది. 2019 నుండి 2022 మధ్యకాలంలో అనేక విధాలుగా మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. సీఎస్ ఎమ్సిఎల్ వారి నుండి సేకరించిన ప్రతి మద్యం కేసుకు డిస్టిల్లర్ల నుండి లంచం వసూలు చేయబడింది, ”అని వారు చెప్పారు.

ఛత్తీస్‌గఢ్ లోని మొత్తం మద్యం వ్యవస్థను అన్వర్ ధేబర్ ఒత్తిడితో అరుణ్ పతి త్రిపాఠి భ్రష్టుపట్టించారని, డిపార్ట్‌మెంట్‌లో అవినీతిని పెంచడానికి తోడ్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో తేలింది. అతను తన ఇతర సహోద్యోగులతో కలిసి కుట్రలో విధాన మార్పులు చేసాడు. గరిష్ట ప్రయోజనాలను పొందగలిగేలా అన్వర్ ధేబర్ సహచరులకు టెండర్లు ఇచ్చాడు.

సీఎస్ ఎమ్సిఎల్ ఎండీ, సీనియర్ ఐటీఎస్ అధికారి అయి ఉండి రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పనితీరుకు విరుద్ధంగా వ్యవహరించాడని తెలిపారు.ఈ చర్యలు రాష్ట్ర ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించాయి. లిక్కర్ సిండికేట్ లబ్ధిదారులకు రూ. 2000 కోట్లకు పైగా అక్రమ లాభాలు ఆర్జించి పెట్టాయి. ఈ దోపిడీలో అతనికి గణనీయమైన వాటా కూడా ఉందని ఆరోపించింది. 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాయ్‌పూర్, భిలాయ్, ముంబైలోని అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల ఫలితంగా నయా రాయ్‌పూర్‌లో జేవీ అనే పేరుతో అన్వర్ ధేబర్ 53 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తేలింది. దీని విలువ రూ. 21.60 కోట్లు అని అది మద్యం అక్రమాల్లో సంపాదించిన డబ్బుతోనే కొన్నదని ఈడీ దర్యాప్తులో తెలిపింది. 

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని కొన్ని నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ ఛత్తీస్‌గఢ్ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలోని బిజెపియేతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది.