Asianet News TeluguAsianet News Telugu

హిందువులుగా ఉన్నని రోజులు నువ్వు అంటరాని వాడివే..  డీఎంకే ఎంపీ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ్ మున్నేట్ర కజగం(డీఎంకే)కు చెందిన ఎంపీ ఏ రాజా చేసిన వ్యాఖ్యలపై భారీ వివాదం చెలారేగేలాగే ఉంది. హిందూ మతంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. 

DMKs A Raja says Youre untouchable as long as youre Hindu
Author
First Published Sep 13, 2022, 5:49 PM IST

తమిళనాడు అధికార డీఎంకే పార్టీ ఎంపీ ఏ రాజా మతం గురించి కించపరిచే వ్యాఖ్యలు చేసిన వీడియో  వైరల్ అవుతోంది. ఆ వీడియోలో డీఎంకే ఎంపీ హిందువులను అంటరానివాళ్లుగా పేర్కొంటున్నారు. అంతే కాకుండా..ఆయ‌న హిందువుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానంపై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. తమిళనాడులోని నమక్కల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఇంత‌కీ ఏమ‌న్నారంటే..? 

రాజా తమిళంలో మాట్లాడుతూ.. వర్ణ వ్యవస్థలో అత్యల్ప కులమైన శూద్రులు వేశ్యల పిల్లలని, వారు హిందూ మతాన్ని ఆచరిస్తున్నంత కాలం వారు అలాగే ఉంటారని వ్యాఖ్యానించారు. “ నువ్వు హిందువుగా ఉన్నంత‌ వరకు నువ్వు శూద్రుడివి గానే ఉంటావు. నువ్వు శూద్రుడివి ఉన్నంత వ‌ర‌కూ వేశ్య కొడుకువి. నువ్వు హిందువుగా ఉన్నంత‌ వరకు పంజాయతువి (దళితుడివి)  హిందువుగా ఉన్నంత వ‌ర‌కు నువ్వు అంటరానివాడివి” అని ఆయన అన్నారు.

ద్రవిడర్ కజగం అనేది ప్రస్తుతం ఉన్న కుల వ్యవస్థ, అంటరానితనం యొక్క రుగ్మతలను నిర్మూలించే లక్ష్యంతో పెరియార్ EV రామసామి స్థాపించిన సామాజిక ఉద్యమం. "మీలో ఎంతమంది ఒక వేశ్య కొడుకుగా, అంటరానివాడిగా ఉండాలనుకుంటున్నారు అని మీరు గట్టిగా అడగడం ప్రారంభించినప్పుడే..  సనాతన మూలాలను నాశనమ‌వుతాయి" అని రాజా అన్నాడు.

అంతేకాకుండా.. ఆయ‌న‌ భారత సుప్రీంకోర్టును కూడా తీవ్రంగా విమర్శించారు. “మీరు క్రిస్టియన్, ముస్లిం లేదా పర్షియన్ కాకపోతే.. మీరు హిందువు అయి ఉండాలని సుప్రీంకోర్టు చెబుతోంది. ఇంత దారుణం మరే దేశంలోనైనా చూశారా? అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

అలాగే.. సనాతన్ ధర్మాన్ని సవాలు చేస్తూ.. ప్రజలను ప్రశ్నలను లేవనెత్తాలని,  కుల సమస్యల గురించి మాట్లాడమని అన్నారు. డీఎంకే మౌత్‌పీస్‌ మురసోలి, ద్రవిడర్‌ కజగమ్ లు  ఈ అంశాన్ని చ‌ర్చ‌లు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఆయన ప్రకటన తర్వాత త‌మిళ రాజ‌కీయం వేడెక్కింది. తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై  తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియోను పంచుకుంటూ ఆయ‌న ఇలా రాసుకొచ్చారు. "తమిళనాడులో రాజకీయ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. డిఎంకె ఎంపి ఎ రాజా ఇతరులను సంతోషపెట్టాలనే లక్ష్యంతో మరోసారి ఒక వర్గంపై ద్వేషాన్ని వ్యాప్తి చేశారు. తమిళనాడుకు తామే గుర్రుగా ఉన్నామని భావించే ఈ రాజకీయ నేతల మనస్తత్వం చాలా దురదృష్టకరం. అని పేర్కొన్నారు. 

హిందువుల గురించి డీఎంకే మంత్రి ఓ రాజు చేసిన‌ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న అసంబద్ధమైన మాటలపై సోషల్ మీడియా నెటిజ‌న్లు తీవ్రంగా  స్పందిస్తున్నారు. భారీ ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
  
డీఎంకే నేత వ్యాఖ్యలపై దుమారం రేగడంతో, ఎ రాజా తన వైఖరిని సమర్థించుకునేందుకు ట్విట్టర్‌లో మ‌రో కామెంట్ చేశారు. "శూద్రులు ఎవరు? వారు హిందువులు కాదా? మనుస్మృతిలో సమానత్వం, విద్య, ఉద్యోగాలు, ఆలయ ప్రవేశాన్ని నిరాకరించి వారిని ఎందుకు అవమానించింది. 90% హిందువుల రక్షకుడిగా ద్రావిడ ఉద్యమం వీటిని ప్రశ్నించింది. పరిష్కరించింది. అని ట్విట్ చేశారు. 

తమిళనాడు స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వంలో సీనియర్ నాయకుడు ఎ రాజా. ఆయ‌న‌ గతంలో కూడా ఇలాంటి  వివాదాస్పద ప్రకటనలు చేశారు. 2 జి స్కామ్ వంటి అవినీతి కేసుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios