తమిళనాడు రాష్ట్ర మంత్రి  సెంథిల్ బాలాజీ  నివాసంలో  ఐటీ అధికారుల ు సోదాలు  నిర్వహించారు.  ఐటీ అధికారులను డీఎంకె  శ్రేణులు అడ్డుకున్నాయి.  

చెన్నై:తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంలో శుక్రవారం నాడు ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 40 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయితే మంత్రి సెంథిల్ కుమార్ నివాసంలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన ఐటీ అధికారుల వాహనాలను డీఎంకె నేతలు ధ్వంసం చేశారు. 

మంత్రి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని 40 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. 
చెన్నై,కోయంబత్తూరు,కరూర్ జిల్లాలో ని 40 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఐటీ అధికారుల వాహనాలను డీఎంకె నేతలు ధ్వంసం చేశారు. ఐటీ అధికారులతో డీఎంకె నేతలు వాగ్వాదానికి దిగారు. ఐటీ అధికారుల బృందంలో ఉన్న మహిళ అధికారిని డీఎంకె శ్రేణులు అడ్డుకున్నారు.

ఐటీ అధికారులు తమ వాహనాలపై దాడుల విషయమై కరూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారుల సోదాల సమయంలో పోలీసులు భద్రత కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ అధికారులపై డీఎంకె శ్రీణుల దాడులను బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. మరో వైపు తన నివాసంలో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేదని మంత్రి సెంథిల్ బాలాజీ స్పష్టం చేశారు మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుల ఇళ్లలో సోదాలు జరిగినట్టుగా సమాచారం.