డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్  అపోలో ఆస్పత్రిలో చేరారు. నిన్న అర్థరాత్రి అల్వార్‌పేటలోని తన నివాసంలో స్టాలిన్ అస్వస్థతకు లోనవ్వడంతో కుటుంబసభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

స్టాలిన్ కుడివైపు తొడలో సిస్ట్ ఉందని.. దీనిని చిన్న ఆపరేషన్ ద్వారా తొలగించామని.. గురువారం మధ్యాహ్నానం డిశ్చార్జి చేస్తామని అపోలో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం స్టాలిన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.