Asianet News TeluguAsianet News Telugu

34 మంది స్టాలిన్ జంబో కేబినెట్.. రేపే ప్రమాణ స్వీకారం, ఉదయనిధికి దక్కని చోటు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పదేళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే పార్టీ రెడీ అయ్యింది.  మొత్తం 234 స్థానాలకు గానూ 133 చోట్ల  విజయం సాధించిన డీఎంకే.. స్టాలిన్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

dmk issues list of 34 ministers tamilnadu cmelect stalin gets home ksp
Author
Chennai, First Published May 6, 2021, 9:33 PM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పదేళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే పార్టీ రెడీ అయ్యింది.  మొత్తం 234 స్థానాలకు గానూ 133 చోట్ల విజయం సాధించిన డీఎంకే.. స్టాలిన్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

తాజాగా 34 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు డీఎంకే గురువారం ప్రకటన విడుదల చేసింది. వీరంతా శుక్రవారం స్టాలిన్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కీలక శాఖలను మాత్రం స్టాలిన్‌ తన వద్దే ఉంచుకున్నట్లు సమాచారం.

Also Read:స్టాలిన్ విజయం: చంద్రబాబు, కేసీఆర్ చేయాల్సింది అదే...

హోంశాఖతో పాటు సంక్షేమ శాఖ, జనరల్‌ అడ్మినిష్ట్రేషన్‌ తదితర విభాగాలను స్టాలిన్‌ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల నియామకాలు, బదిలీలను కూడా ఆయనే నేరుగా పర్యవేక్షించనున్నారు.

మరోవైపు స్టాలిన్‌ తనయుడు, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయనిధికి మాత్రం కేబినెట్‌లో స్థానం దక్కలేదు. అయితే భవిష్యత్‌లో స్టాలిన్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారా? వీరినే కొనసాగిస్తారా అన్న దానికి కాలమే సమాధానం చెప్పనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios