Bengaluru: కర్ణాటక డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించేలా చేయమని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలను డీకే శివకుమార్ వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టడానికి ఇష్టపడని డీకే శివకుమార్ పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 20న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
Karnataka Congress President DK Shivakumar: కర్నాటకలో తిరుగులేని విజయం కాంగ్రెస్ పార్టీలు ముఖ్యమంత్రి ఫేస్ గురించి పెద్దఎత్తున చర్చ జరిగింది. నాలుగు రోజుల చర్చల అనంతరం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారనీ, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే షరతులకు డీకే శివకుమార్ అంగీకరించడంతో కర్ణాటక సీఎం రేసుపై సందిగ్ధతకు తెరపడింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పోటీపై కర్ణాటకలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి.
ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు సీనియర్ నేత సిద్ధరామయ్యను కొత్త సీఎంగా ప్రకటించింది. సీఎం రేసులో ఉన్న ఆయన ప్రధాన ప్రత్యర్థికి డిప్యూటీ పదవిని కట్టబెట్టింది.డిప్యూటీ సీఎం పదవిని చేపట్టడానికి ఇష్టపడని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి కలిసి పనిచేయాలని కోరడంతో ఒక అంగీకారానికి వచ్చారు. "అంతా బాగుంది, అంతా బాగుంటుంది.. హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వన్ లైన్ నిర్ణయం తీసుకున్నాం. చివరకు రాహుల్ గాంధీ తనకు ఫోన్ చేసి మీరంతా కలిసి పనిచేయాలని చెప్పారని" డీకే శివకుమార్ తెలిపారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రిగా నియమితులైనందుకు సంతోషంగా ఉన్నారా అన్న ప్రశ్నకు శివకుమార్ సమాధానమిస్తూ.. "నేను ఎందుకు కలత చెందాలి? ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది" అని తెలిపారు. అయితే శివకుమార్ కు సీఎం పదవి వస్తుందని ఆశించినందున ఈ నిర్ణయంతో తాను పూర్తిగా సంతోషంగా లేనని ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ అన్నారు. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి పేరును ప్రకటించడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శించింది. నిర్ణయాల్లో జాప్యం పార్టీలో ఐక్యత లోపానికి నిదర్శనమని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. 'మా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ. మేము ఏకాభిప్రాయాన్ని నమ్ముతాము, నియంతృత్వాన్ని కాదు" అంటూ కౌంటర్ ఇచ్చారు.
కాగా, ఈ నెల 20న కర్ణాటక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానించారు. 2013 నుంచి 2018 వరకు సీఎంగా పనిచేసిన సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. మే 13న ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య మైసూరులోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి వి.సోమన్నపై భారీ తేడాతో విజయం సాధించారు.
మే 10న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 135, బీజేపీ 66, కింగ్ మేకర్ గా భావించే జేడీఎస్ 19 స్థానాల్లో విజయం సాధించాయి.
