కర్ణాటకలో అనర్హత వేటుపడిన 9 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమీక్షిస్తుందా.. అనర్హత వేటును తొలగిస్తుందా.. తాము జోక్యం చేసుకోలేమని తేల్చేస్తుందా..? లేదంటే కొత్త స్పీకర్ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేల దరఖాస్తును స్వీకరించి పున: సమీక్షించి రాజీనామాలను స్వీకరించి, అనర్హత వేటును తొలగిస్తారా అనేది త్వరలోనే తేలిపోనుంది.

కాగా అనర్హత వేటుతో ఇప్పటికే సతమతమవుతున్న జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు తాజాగా మరో షాక్ తగిలింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా జేడీఎస్ అధినేత దేవెగౌడ ఆదేశాలు జారీ చేశారు.