కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కి ఘోర అవమానం జరిగింది. బెంగళూరులోని హోటల్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు బుధవారం ఉదయం దిగ్విజయ్ సింగ్ వెళ్లగా.. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను పోలీసులు లాగి పక్కన పెట్టారు. దీంతో... ఆయన హోటల్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టగా... పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Also Read రేపే డెడ్ లైన్: మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కు గవర్నర్ అల్టిమేటం...

కాగా... బుధవారం ఉదయం దిగ్విజయ్ సింగ్ బెంగళూరు చేరుకున్నారు. కాగా... ఆయనకు ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గా ఎంపికైన డీకే శివకుమార్ స్వాగతం పలికారు. ఆయనతో కలిసే డిగ్గీ రాజా..  22మంది రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ కి వెళ్లారు. 

కాగా... ఇటీవల జ్యతిరాదిత్య సింథియాతో కలిసి దాదాపు 22మంది ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా మధ్య ప్రదేశ్ రాజకీయం మలుపులు తిరిగింది. దీంతో.. బలపరీక్ష కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తమ రెబల్స్ ని మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు బీజేపీ కూడా మధ్యప్రదేశ్ లో అధికారం కోసం తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి తమ పార్టీలోకి వస్తారని అనుకుంటున్నామన్నారు. వారి కుటుంబసభ్యులతో కూడా తాము మాట్లాడమని చెప్పారు. అయితే... బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను బంధించారి.. ఫోన్లు కూడా లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు. 

ఇదిలా ఉండగా.. బెంగళూరు నుండి ఎమ్మెల్యేలను "సురక్షితంగా తిరిగి" తీసుకురావడానికి గట్టి చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గవర్నర్ లాల్జీ టాండన్కు లేఖ రాశారు. తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో విలేకరుల సమావేశం నిర్వహించిన 10 గంటల తర్వాత ఈ లేఖ పంపడం గమనార్హం. అయితే వారు మాత్రం తమను ఎవరూ బందించలేదు.. స్వతహాగానే రాజీనామా చేశామని చెబుతున్నారు.