మహాా కుంభమేళాలో డిజిటల్ మ్యూజియం ... యోగి సర్కార్ వినూత్న ప్రయత్నం
2025 మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగరాజ్‌లో 'డిజిటల్ కుంభ మ్యూజియం'ను ఏర్పాటు చేస్తోంది.
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో జరిగే అతిపెద్ద ఉత్సవాల్లో మహా కుంభమేళా ఒకటి. 2025లో అంటే వచ్చే ఏడాది జరగనున్న ఈ దివ్య భవ్య మహాకుంభాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం యోగి ఆలోచన మేరకు, ప్రయాగరాజ్‌లో పర్యాటక శాఖ 'డిజిటల్ కుంభ మ్యూజియం'ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ భక్తులు డిజిటల్ మాధ్యమాల ద్వారా సముద్ర మథనం వీక్షించవచ్చు. అంతేకాకుండా కుంభం, మహాకుంభంతో పాటు ఇతర మతపరమైన ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి కూడా సమాచారం అందించబడుతుంది.
పర్యాటక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉత్తరప్రదేశ్‌కు మహాకుంభం- 2025 మంచి అవకాశమే కాదు సవాలుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో భక్తులకు విశిష్టమైన అనుభవాన్ని అందించడానికి పర్యాటక శాఖ నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రయాగరాజ్‌లోని శివాలయ పార్క్ సమీపంలో అరైల్ రోడ్ నైనిలో డిజిటల్ కుంభ మ్యూజియం నిర్మాణం జరగనుంది. దీని కోసం రూ.21.38 కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ.6 కోట్లు విడుదల చేయబడ్డాయి. 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ మ్యూజియంలో ఒకేసారి 2000 నుంచి 2500 మంది సందర్శించవచ్చు. ఈ విషయాన్ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించారు.
ఈ యాప్ వుంటే చాలు ... యూపీని చుట్టేయవచ్చు
సీఎం యోగి ఆలోచన మేరకు ఈ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ మ్యూజియంలో సముద్ర మథనంలోని 14 రత్నాల గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా సముద్ర మథనం గురించి వివరణాత్మక సమాచారం అందించబడుతుంది. డిజిటల్ స్క్రీన్‌లతో సహా ఇతర మాధ్యమాల ద్వారా ప్రయాగరాజ్ మహాకుంభం-కుంభం, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని మొదలైన వాటి గురించి వివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా ల్యాండ్‌స్కేపింగ్‌ను అభివృద్ధి చేస్తారు. టికెట్ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.
మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు తన వనవాసంలో దాదాపు 11 సంవత్సరాలు గడిపిన పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. మీరు అక్కడ తిరగాలనుకుంటే మీ మొబైల్‌లో చిత్రకూట్ టూరిజం యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక్కడ దర్శనీయ స్థలాల పేరు, ప్రాముఖ్యత, దర్శన సమయాలు సహా అన్ని వివరాలు లభిస్తాయి. అంతేకాదు మీరు ఎలా చేరుకోవాలి, ఎక్కడ బస చేయవచ్చు అనే వివరాలను కూడా ఈ యాప్ అందిస్తుంది. పర్యాటకుల సౌలభ్యం కోసం ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు.
యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే దర్శనీయ స్థలాల పేరు, వాటి వివరాలు కనిపిస్తాయి. ఉదాహరణకు రామ్‌ఘాట్‌పై క్లిక్ చేయగానే సందర్శన సమయం, ఆ ప్రదేశం ప్రాముఖ్యత, చరిత్ర, ఉష్ణోగ్రత, నగరం నుంచి దూరం సహా ఇతర సమాచారం అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఇతర ప్రదేశాల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫెస్టివల్ & ఈవెంట్‌పై క్లిక్ చేయడం ద్వారా మహాకుంభం, చిత్రకూట్ మహోత్సవ్, రామనవమి, జాతీయ రామాయణ మేళా మొదలైన వాటి గురించి వివరణాత్మక సమాచారం అందుతుంది.
మహాకుంభంలో ప్రత్యేక స్నాన తేదీలు, ప్రాముఖ్యత మొదలైన వాటి గురించి సమాచారం అందించబడింది. అంతేకాకుండా స్థానికంగా ప్రసిద్ధి చెందిన షాపింగ్ ప్రాంతాలు మొదలైన వాటి గురించి కూడా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంది. యాప్‌లో కనెక్టివిటీ, బస చేయడానికి సమీపంలోని పెట్రోల్ పంపులు, ATMల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.