టీవీల్లో కానీ.. పేపర్లలో కానీ పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలించినట్లయితే ఎప్పుడూ పెట్రోల్ ధరదే పైచేయి.. ఈ రెండింటి మధ్య కనీసం 10 శాతం వ్యత్యాసం ఉండేది.. కానీ దేశచరిత్రలోనే తొలిసారిగా పెట్రోల్ ధరను డీజిల్ దాటేసింది.

అవును ఇది నిజం... ఒడిశా రాజధాని భువనేశ్వర్‌‌లో ఈ వింత పరిస్థితి నెలకొంది. దీనిపై ఆ రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి శశిభూషణ్ బెహరా స్పందిస్తూ.. పెట్రోల్, డీజిల్ ఇంధన ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలతో ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చిందని అన్నారు.

డీజిల్ మూల ధర పెట్రోల్ ధర కంటే అధికంగా కొనసాగుతోందన్నారు.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి ఇంధనం ధరలు తగ్గుముఖం పడుతుండగా రాష్ట్రంలో వీటి ధరలు తరచూ పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం భువనేశ్వర్‌లో లీటర్ పెట్రోల్ ధఱ రూ.80.97 కాగా.. డీజిల్ లీటరు ధర రూ.80.96గా కొనసాగుతోంది.