పాట్నా: తనకు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలని తాను ఎప్పుడూ కూడ చెప్పలేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.సమీప భవిష్యత్తులో తాను రాజకీయాల నుండి రిటైర్ కానున్నట్టుగా చెప్పలేదన్నారు.

also read:ఈ ఎన్నికలే నాకు చివరివి: బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలనం

ఈ నెల ప్రారంభంలో బీహార్ లోని పూర్నియాలో జేడీ(యూ) అభ్యర్ధి తరపున ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో  ఇది ఎన్నికల చివరి రోజు.. ఎల్లుండి పోలింగ్ జరుగుతోందని తాను చెప్పానని ఆయన వివరించారు.

 

నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీతో పాటు ఇతర పార్టీలు కూడ స్పందించాయి. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు అప్పట్లోనే సందేహాలను వ్యక్తం చేశాయి.2017లో మహా కూటమి నుండి వైదొలిగి నితీష్ కుమార్ బీజేపీతో చేరారు. 2016 ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసిన నితీష్.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపిన విషయాన్ని  విపక్షాలు ఈ సందర్భంగా గుర్తు చేశాయి.

బీహార్ లో జరిగిన ఎన్నికల్లో జేడీ (యూ) 43 స్థానాల్లో గెలిస్తే బీజేపీ 74 స్థానాలను గెలుచుకొంది.ఆర్జేడీ 75 స్థానాల్లో విజయం సాధించింది.