Asianet News TeluguAsianet News Telugu

ధార్వాడ్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

వీరశైవ లింగాయత్ సామాజిక వర్గంతో పాటు మరాఠాల సంస్కృతి, ఆచార వ్యవహారాలు ధార్వాడ్ ప్రాంతంలో కనిపిస్తాయి. ఉత్తర కర్ణాటకలో అతిపెద్ద నగరాలైన హుబ్లీ- ధార్వాడ్ ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తోంది. ఎంతోమంది ఉద్ధండులైన నేతలను, పారిశ్రామికవేత్తలను, కళాకారులను, సాహితవేత్తలను ఈ గడ్డ దేశానికి అందించింది. 2009లో ధార్వాడ్ లోక్‌సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రహ్లాద్ జోషినే గెలుస్తూ వస్తున్నారు. ధార్వాడ్ లోక్‌సభ స్థానంలో నవలగుంద, కుందగోల్, ధార్వాడ్, హుబ్లీ ధార్వాడ్ ఈస్ట్ (ఎస్సీ), హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్, హుబ్లీ ధార్వాడ్ వెస్ట్, కల్ఘాట్గి, షిగ్గాన్ అసెంబ్లీ స్థానాలున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మరోసారి టికెట్ కేటాయించారు. కాంగ్రెస్ విషయానికి వస్తే.. వినోద్ అసూతిని బరిలో దించింది.

Dharwad Lok Sabha elections result 2024 ksp
Author
First Published Apr 4, 2024, 5:27 PM IST

కర్ణాటకలోని కీలకమైన లోక్‌సభ నియోజకవర్గం ధార్వాడ్ . ఉత్తర కర్ణాటకలో అతిపెద్ద నగరాలైన హుబ్లీ- ధార్వాడ్ ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తోంది. కర్ణాటకలో బెంగళూరు తర్వాత అతిపెద్ద నగరం ఇదే. వాణిజ్యం, ఉద్యోగం, వ్యాపారాలకు ఈ నగరం కేంద్రం. వీరశైవ లింగాయత్ సామాజిక వర్గంతో పాటు మరాఠాల సంస్కృతి, ఆచార వ్యవహారాలు ధార్వాడ్ ప్రాంతంలో కనిపిస్తాయి. ఎంతోమంది ఉద్ధండులైన నేతలను, పారిశ్రామికవేత్తలను, కళాకారులను, సాహితవేత్తలను ఈ గడ్డ దేశానికి అందించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వుండటంతో ఈ సెగ్మెంట్‌పై అందరి చూపు నెలకొంది. 

2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న ధార్వాడ్ నార్త్ లోక్‌సభ స్థానాన్ని రద్దు చేసి .. ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ధార్వాడ్ నార్త్ పరిధిలో ధార్వాడ్ రూరల్, ధార్వాడ్ , హుబ్లీ, హుబ్లీ రూరల్, కల్ఘాట్గి, గదగ్, నరగుంద, నవల్‌గుంద అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ కంచుకోట.

నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 1991 వరకు ధార్వాడ్‌ నార్త్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ తప్పించి మరో పార్టీ గెలవలేదు. మొత్తంగా హస్తం పార్టీ 10 సార్లు విజయం సాధించింది. అయితే 1996లో బీజేపీ అభ్యర్ధి విజయ్ సంకేశ్వర్ కాంగ్రెస్ కంచుకోటను బద్ధలుకొట్టారు. 1996 నుంచి 1999 వరకు ఆయన వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ను నమోదు చేయడంతో పాటు ధార్వాడ్ నార్త్‌ను బీజేపీకి కంచుకోటగా మార్చారు. ఆ తర్వాత 2004లో ప్రహ్లాద్ జోషిగా ఎంపీగా గెలుపొందారు. 

ధార్వాడ్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 ..  .. బీజేపీ హ్యాట్రిక్ విజయాలు :

2009లో ధార్వాడ్ లోక్‌సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రహ్లాద్ జోషినే గెలుస్తూ వస్తున్నారు. 2019లో నరేంద్ర మోడీ రెండో సారి ప్రధానిగా గెలుపొందిన తర్వాత ఆయన కేబినెట్‌లో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, మైనింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ధార్వాడ్ లోక్‌సభ స్థానంలో నవలగుంద, కుందగోల్, ధార్వాడ్, హుబ్లీ ధార్వాడ్ ఈస్ట్ (ఎస్సీ), హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్, హుబ్లీ ధార్వాడ్ వెస్ట్, కల్ఘాట్గి, షిగ్గాన్ అసెంబ్లీ స్థానాలున్నాయి.

ఈ సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,91,024 మంది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ధార్వాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని 8 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో నాలుగు చోట్ల గెలుపొందాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ప్రహ్లాద్ జోషికి 6,84,837 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి వినయ్ కులకర్ణికి 4,79,765 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ప్రహ్లాద్ జోషి 2,05,072 ఓట్ల మెజారిటీతో ధార్వాడ్‌లో హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. 

ధార్వాడ్ ఎంపీ (పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఐదో విజయంపై ప్రహ్లాద్ జోషి కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. ధార్వాడ్‌లో తమ పట్టు కోల్పోకూడదని కమలనాథులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మరోసారి టికెట్ కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మోడీ ఛరిష్మా తనను ఐదోసారి గెలిపిస్తాయని జోషి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే.. వినోద్ అసూతిని బరిలో దించింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో వుండటంతో, ధార్వాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోనూ బలంగా వుండటంతో బీజేపీ కంచుకోటను బద్ధలు కొడతానని వినోద్ చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios