ముంబైలో కరోనా విశ్వరూపం: భయపెడుతున్న ధారావి, నెల వ్యవధిలో 62 శాతం పెరుగుదల

మహారాష్ట్ర మరోసారి దేశంలో కరోనా హాట్ స్పాట్‌గా మారుతోంది. గడిచిన కొన్ని రోజులుగా అక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 65 శాతం అక్కడే నమోదవుతున్నాయి

Dharavi sees 62 percent jump in Covid cases in March as compared to last month ksp

మహారాష్ట్ర మరోసారి దేశంలో కరోనా హాట్ స్పాట్‌గా మారుతోంది. గడిచిన కొన్ని రోజులుగా అక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 65 శాతం అక్కడే నమోదవుతున్నాయి.

అటు దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ పరిస్ధితి భయానకంగా వుంది. కేసుల తీవ్రత దృష్ట్యా ఇక్కడ త్వరలోనే మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావిపై పడింది.

నిపుణులు ఊహించినట్లుగానే ఇక్కడ మహమ్మారి మరోసారి విశ్వరూపం దాల్చుతోంది. ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో పాజిటివ్ కేసుల సంఖ్య 62 శాతం పెరిగినట్టు అధికారులు వెల్లడించారు.

ఫిబ్రవరిలో ఇక్కడ మొత్తం 168 కేసులు నమోదు కాగా.. మార్చి నెలలో నిన్నటి వరకు 272 మంది కరోనా బారిన పడ్డారు. 2.5 చదరపు కిలోమీటర్ల అతి చిన్న విస్తీర్ణంలోని వున్న ధారవిలో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

అయితే కరోనా విజృంభించిన తొలి నాళ్లకంటే ఇప్పుడు దానిని ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ధారావిలో నమోదవుతున్న కేసులు అన్నీ ఒకేచోట నమోదైనవి కావని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మురికివాడలో యాక్టివ్ కేసులు 72 వరకు ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios