కరోనా కారణంగా ఎక్కువగా కుదేలైన రంగం వుంది అంటే అది ఏవియేషన్ మాత్రమే. గతేడాది మార్చి నుంచి విమాన ప్రయాణాలపై అన్ని దేశాలు ఆంక్షల్ని విధిస్తూ వచ్చాయి. తాజాగా అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమాన సేవల నిలిపివేతను ఏప్రిల్ 30 వరకు పొడిగించారు.

కరోనా కారణంగా ఎక్కువగా కుదేలైన రంగం వుంది అంటే అది ఏవియేషన్ మాత్రమే. గతేడాది మార్చి నుంచి విమాన ప్రయాణాలపై అన్ని దేశాలు ఆంక్షల్ని విధిస్తూ వచ్చాయి.

తాజాగా అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమాన సేవల నిలిపివేతను ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి షెడ్యూల్డు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఈ సస్పెన్షన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంగళవారం ప్రకటించింది. అవసరాన్ని బట్టి ఎంపిక చేసిన మార్గాల్లో షెడ్యూల్డు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ను అధికారులు అనుమతించే అవకాశం ఉందని డీజీసీఏ తెలిపింది. 

వైమానిక సేవలను నిలిపివేసిన నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను గత ఏడాది మే నెల నుంచి వందే భారత్ మిషన్ క్రింద ఎయిరిండియా ప్రత్యేక విమానాలను నడుపుతోంది.

ఈ క్రమంలో గతేడాది జూలై నుంచి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా ‘‘ఎయిర్ బబుల్’’ను ఏర్పాటు చేసి, విమానాలను నడుపుతున్నారు.

బ్రిటన్, అమెరికా, యూఏఈ, కెన్యా, భూటాన్ తదితర దేశాలతో ఇటువంటి ఏర్పాట్లు జరిగాయి. మంగళవారం డీజీసీఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన ఇంటర్నేషనల్ ఆల్ కార్గో ఆపరేషన్స్, ఫ్లైట్స్‌కు ఈ ఆంక్షలు వర్తించవు.