Asianet News TeluguAsianet News Telugu

‘బుజ్జాయి’ ఇకలేరు..

దివంగత కవి దిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు కార్టూన్ ప్రపంచంలో ‘డుంబు’ పాత్ర సృష్టికర్తగా  దేవులపల్లి సుబ్బరాయ శర్మ  (91) అందరికీ పరిచితుడే.  వృద్ధాప్య సమస్యలతోపాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, చిత్రకారులు సంతాపం వ్యక్తం చేశారు.

devulapalli subbaraya sastri passed away in chennai
Author
Hyderabad, First Published Jan 28, 2022, 8:38 AM IST

చెన్నై : చిట్టిపొట్టి బొమ్మలు, బాలల కథల సంపుటితో Bujjaiగా బహుళ ప్రాచుర్యం పొందిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో ప్రముఖ రచయిత, కవి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు 1931 సెప్టెంబర్ 11న ఆయన జన్మించారు. బుజ్జాయి అనే కలంపేరుతో ఫ్రీలాన్స్ కార్టూనిస్టుగా, చిన్నపిల్లల కథారచయితగా ప్రసిద్ధి చెందారు. 

ఆయన బొమ్మల కథల్లో ‘డుంబు’ చిన్నారులను బాగా అలరించింది. అలాగే ‘పంచతంత్ర’ ధారావాహిక కథలు ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ’ లో 1963-68 వరకు ప్రచురితమయ్యాయి. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మల ద్వారా పాఠకులకు పరిచయం చేశారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన లపు రచనలకు అవార్డులు అందించాయి. 

దివంగత కవి దిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు కార్టూన్ ప్రపంచంలో ‘డుంబు’ పాత్ర సృష్టికర్తగా  దేవులపల్లి సుబ్బరాయ శర్మ  (91) అందరికీ పరిచితుడే.  వృద్ధాప్య సమస్యలతోపాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, చిత్రకారులు సంతాపం వ్యక్తం చేశారు. 1931 సెప్టెంబర్ 11న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో జన్మించిన సుబ్బరాయశాస్త్రి చిన్నతనం నుంచి చిత్రలేఖనం అంటే మక్కువ.

అదే ఆయన్ని బాపిరాజు, మొక్కపాటి, పిలకా, గోఖలే వంటి మహామహుల వద్ద చిత్ర చిత్రలేఖన మెళకువలు నేర్చుకునేలా ప్రేరేపించింది. తన తండ్రి దేవులపల్లి ఒడే బడిగా ఎదిగిన మేధావి ఆయన. తన కార్టూన్లలో ‘బుజ్జాయి’ గా  చిరపరిచితుడు అయిన  ఆయన..  భారత్ కు సరికొత్త కామిక్స్ కథల్ని పరిచయం చేశారు. ఎంతోమంది కార్టునిస్టులకి స్ఫూర్తినిచ్చారు.  
ఆరు దశాబ్దాలకు పైగా ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా,  ఆంధ్ర పత్రిక,  ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో..  ఇంకా తమిళం, ఆంగ్లం, హిందీ పత్రికల్లో ఆయన బొమ్మల కథలు పాఠకులను అలరించాయి. 

17 ఏళ్ల ప్రాయంలోనే  ‘బానిస పిల్ల’ పేరుతో  30పేజీల బొమ్మల కథా పుస్తకాన్ని వేయగా అది వేలాది కాపీలు అమ్ముడుపోయింది. 1960లో ఆంధ్రజ్యోతి దినపత్రికను నార్ల వెంకటేశ్వరరావు ప్రారంభించినప్పుడు మొదటిరోజు నుంచి తెలుగులో తొలి స్ట్రిప్ కార్టూన్ వేసేవారు. 1963లో సంపూర్ణ పంచతంత్రం ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ధారావాహికంగా ఐదేళ్లు ప్రచురించారు. అది ఆయనకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది.  

‘డుంబు’ పాత్రను సృష్టించిన ఆయన.. దాని పేరుతో 1954లో ఆంధ్రప్రభలో సీరియల్ నిర్వహించారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో 100కు పైగా చిన్నారుల కామిక్స్, కథలు  పుస్తకాలు  ముద్రించారు. 1959, 1960, 1961లలో వరుసగా కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక అవార్డులు ఇవ్వగా,  1992లో ఏపీ ప్రభుత్వం ‘బాలబంధు’ బిరుదుతో సత్కరించింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios