'సనాతన బోర్డ్' ఏర్పాటు చేయాల్సిందే..: దేవకినందన్ ఠాకూర్
దేవకినందన్ ఠాకూర్ మహాకుంభ్ 2025 ఏర్పాట్లను ప్రశంసించారు, 'సనాతన బోర్డ్' ఏర్పాటు అవసరం అన్నారు. దేవాలయాల ఆస్తుల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసి, సనాతన ధర్మ పరిరక్షణకు పిలుపునిచ్చారు.

మహాకుంభ్ నగర్ : ప్రముఖ కథావాచకులు దేవకినందన్ ఠాకూర్ మహాకుంభ్ 2025 కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో చేపట్టిన ఏర్పాట్లను ప్రశంసించారు. రోడ్లు, నీరు, ఇతర వసతులను చక్కగా ఏర్పాటు చేసి ఈ మహా పర్వాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అద్భుతమైన కృషి చేసిందని అన్నారు. ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించి బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రిని ఠాకూర్ అభినందించారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సనాతన ధర్మానికి అనుకూలం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సనాతన ధర్మానికి అనుకూలమైన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని దేవకినందన్ ఠాకూర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ సనాతన ధర్మ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వ పాలన రాష్ట్రానికి, దేశానికి చాలా మేలు చేస్తుందని అన్నారు.
సనాతన ధర్మ పరిరక్షణకు పిలుపు
సనాతన ధర్మ పరిరక్షణ, అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని దేవకినందన్ ఠాకూర్ నొక్కి చెప్పారు. మనం అడవట్లేదు కాబట్టి మనకు దక్కట్లేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ మాట విని సనాతన ధర్మ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

