న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ఆమె మరణవార్త తీవ్ర కలవరానికి గురి చేసిందని అన్నారు. కాంగ్రెసు పార్టీ అత్యంత ప్రీతిపాత్రమైన కూతురిగా ఆమెను రాహుల్ గాంధీ అభివర్ణించారు. 

షీలా దీక్షిత్ తో అత్యంత సన్నిహత అనుబంధం ఉన్నట్లు రాహుల్ గాందీ తెలిపారు. ఆమె మృతికి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఢిల్లీ ప్రజలకు ఆమె నిస్వార్థంగా సేవ చేశారని అన్నారు. 

 

షీలా దీక్షిత్ మృతికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం పర్టించారు. పార్టీలకు అతీతంగా షీలా దీక్షిత్ గౌరవం పొందారని ఆయన అన్నారు. ఆమె మృతికి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు. 

 

షీలా దీక్షిత్ మృతికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సంతాపం ప్రకటించారు. ఆమె సమర్థమైన పాలనాదక్షురాలిగా అభివర్ణించారు. ఆమె మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంతాపం ప్రకటించారు.