కాశీ దగదగా మెరిసిపోనుంది ... యోగి సర్కార్ ఏర్పాట్లు మామూలుగా లేవుగా!

ఈసారి దీపావళి వేడుకలకు పుణ్యక్షేత్రం కాశీ సరికొత్తగా ముస్తాబు కానుంది. నవంబర్ 15న  కాశీ ఘాట్లను 12 లక్షల దీపాలతో అలంకరించనున్నారు...ఈ  దీపపు కాంతులకు లేజర్ షో, గ్రీన్ బాాణాసంచా తోడు కానున్నాయి. 

 

 

Dev Deepawali 2023: Varanasi Ghats to be Illuminated With 12 Lakh Lamps AKP

వారణాసి : ఈ దీపావళి వేళ వారణాసి దీపాల కాంతులతో వెలిగిపోనుంది. నవంబర్ 15న దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దీపావళి సందర్భంగా కాశీ ఘాట్లు దీపాల కాంతులతో దగదగా వెలిగిపోనున్నాయి... ఈ దృశ్యం కనువిందు చేయనుంది. ఈ అద్భుత ద‌ృశ్యాన్ని కనులారా చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు కాశీకి తరలిరానున్నారు.

ఈ ఏడాది దీపావళి వేడుకల కోసం యోగి ప్రభుత్వం 12 లక్షల దీపాలను సిద్దం చేసింది. వీటిని కాశీలోని ఘాట్లు, కుండాలలో అలంకరించనుంది. వీటిలో లక్షలాది దీపాలను గోమయంతో తయారు చేయనున్నారు. దీపావళి వేడుకలను ప్రభుత్వం ఇప్పటికే ప్రాంతీయ వేడుకగా ప్రకటించింది. ఈ వేడుకల్లో భాగంగా లేజర్ షో, గ్రీన్ బాణసంచా కార్యక్రమాలు కూడా ఉంటాయి.

గోమయంతో తయారు చేసిన దీపాలు

కాశీలోని 84కి పైగా ఘాట్లు, కుండాలు, చెరువులను ఈ ఏడాది 12 లక్షలకు పైగా దీపాలతో అలంకరించనున్నారు. 12 లక్షల దీపాల్లో 2.5 లక్షల నుంచి 3 లక్షల దీపాలను గోమయంతో తయారు చేయనున్నట్లు పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ రావత్ తెలిపారు. గంగా నదిలో కూడా దీపాలను వెలిగించనున్నారు. దీంతో గంగా నది మొత్తం దీపాల కాంతులతో దగదగలాడుతుంది. ఘాట్లను శుభ్రం చేసి, విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.

గ్రీన్ బాణసంచా

లేజర్ షో ద్వారా గంగా నది, శివుడి వైభవాన్ని ప్రదర్శించనున్నట్లు పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. గంగా నదిలో కాలుష్య రహిత గ్రీన్ బాణసంచా కార్యక్రమం కూడా ఉంటుంది. దీపావళి వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు. దీంతో హోటళ్లు, గెస్ట్ హౌస్ లు, నౌకలు, బోట్లు అన్నీ పూర్తిగా నిండిపోతాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios