ఇండోర్: వాలంటైన్స్‌ డే రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొన్నాడు.  తన కుటుంబసభ్యులను ఎదిరించి  ఆ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొన్నాడు.

మధ్యప్రదేశ్‌కు జునైద్‌ఖాన్,ట్రాన్స్ జెండర్ జయా సింగ్‌ను ఏడాదిగా ప్రేమిస్తున్నాడు.  రెండు వారాల క్రితం జునైద్ ఖాన్ జయాసింగ్‌కు ప్రపోజ్ చేశాడు. జునైద్ ప్రపోజ్‌కు జయాసింగ్ ఒప్పుకొంది.  ఈ ఇద్దరూ కూడ  వాలంటైన్స్ డే రోజున హిందూ సంప్రదాయం ప్రకారంగా ఓ దేవాలయంలో పెళ్లి చేసుకొన్నారు.

 మా పెళ్లికి మా కుటుంబం ఒప్పుకోవాలని కోరింది. ఒకవేళ వారు ఒప్పుకోకపోయినా కూడ తాను జయతోనే ఉంటానని జునైద్ ప్రకటించారు.  తామిద్దరం కూడ కొంత కాలంగా ప్రేమించుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  

జునైద్ కుటుంబం ఈ పెళ్లికి ఓప్పుకోరు. అయినా కుటుంబాన్ని ఎదిరించి అతను పెళ్లి చేసుకోవడం పట్ల జయాసింగ్  హర్షం వ్యక్తం చేశారు. జునైద్ కుటుంబం ఎప్పటికైనా తమ పెళ్లిని అంగీకరిస్తారని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు.