మగ కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేయమని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళా పోలీసులు డిప్యూటీ తహసీల్దారు లైంగికంగా వేధించినట్లు తెలిసింది. ఆమె దీనిని ఖండించారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో బాధితురాలు ఊటీలోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో పోలీసులు డిప్యూటీ తహసీల్దారును అరెస్ట్ చేశారు.
తమిళనాడు : రోజురోజుకూ మహిళలకు రక్షణ కరువవుతోంది. పని ప్రాంతంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. తమ దగ్గర పనిచేస్తున్నారన్న అలుసుతో లైంగిక వేధింపులతో విసిగిస్తున్నారు. తట్టుకోలేక ఎదురు తిరిగితే వారిపై అభాండాలు మోపి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక మహిళా ఉద్యోగులు బాధను దిగమింగుకుంటున్నారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.
ఊటీలో woman policeకు Sexual harassmentలకు గురి చేసిన deputy tahsildarను పోలీసులు అరెస్ట్ చేశారు. ఊటీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబు (35) డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరగనున్న క్రమంలో Flying Squad విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సాయంగా ఓ మహిళా పోలీసు సహా ఇద్దరు పోలీసులను కేటాయించారు.
మగ కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేయమని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళా పోలీసులు డిప్యూటీ తహసీల్దారు లైంగికంగా వేధించినట్లు తెలిసింది. ఆమె దీనిని ఖండించారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో బాధితురాలు ఊటీలోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో పోలీసులు డిప్యూటీ తహసీల్దారును అరెస్ట్ చేశారు.
కాగా, జనవరి 26న కర్ణాటకలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. నగరంలోని బెస్కాం ఆఫీసులో మహిళా సిబ్బందిని తిపటూరు సబ్ టౌన్ రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ గా పనిచేసే బీకే జగదీష్ sexual harrassmentచేస్తున్నట్లు ఏడుగురు women staff ఫిర్యాదు చేశారు. ఓ ఉద్యోగిని మాట్లాడుతూ జగదీశ్ ను తాను ‘అన్న’ అని పిలుస్తానని, అలా పిలవరాదని అసభ్యంగా మాట్లాడడాని తెలిపారు.
డ్యూటీ అయిపోయాక ఫోన్లు చేస్తూ ఇంట్లో ఎవరూ లేకుంటే.. వచ్చేస్తా.. ఓకేనా.. అంటూ వేధిస్తున్నట్లు వాపోయారు. లాడ్జికి రావాలని వేధించినట్లు మరో ఉద్యోగిని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమశేఖర్ గౌడ స్పందిస్తూ జగదీశ్ ను మరో ప్రాంతానికి బదిలీ చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి కీచక టీచర్ వీడియో కర్ణాటకలో వైరల్ గా మారింది. సమాజంలో ఆదర్శంగా ఉండి, మంచి పౌరులను తీర్చి దిద్దాల్సిన teachers వక్రమార్గం పడుతున్నారు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన students పాలిట కీచకుల్లా మారి నీచంగా ప్రవర్తిస్తున్నారు. బెదిరించి, భయపెట్టి చిన్నారులను లొంగదీసుకుంటూ.. వారిపై అకృత్యాలకు పాల్పడుతూ school పవిత్రతతను దెబ్బతీస్తున్నారు. అలా పవిత్రమైన గురువు వృత్తిలో ఉండి, ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న head master నీచ ఉదంతం ఒకటి బయటపడింది.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం Mysore District హెచ్ డీ కోటె తాలూకాలో వెలుగు చూసింది. విద్యార్థినితో రాసలీలలు చేస్తున్న వీడియోలు WhatsAppలో సర్కిల్ కావడంతో ఆ హెచ్ఎం మీద ప్రజలు భగ్గుమంటున్నారు. మైసూరు వ్యాప్తంగా ఆ వీడియోలు viral కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి స్పందించారు. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని, వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
