మొన్నటిదాక అతని వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. భార్య, ఇద్దరు పిల్లతో సంతోషంగా సాగింది. అనుకోకుండా ఒక్కసారిగా వ్యాపారంలో నష్టం వచ్చింది. చేద్దామంటే ఉద్యోగం లేదు.. జేబులో చిల్లు గవ్వలేదు. 

ఈ వయసులో తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాల్సిందిపోయి.. కుటుంబ పోషణ కోసం వాళ్లమీదే ఆధారపడాల్సి వచ్చింది. దీంతో బాగా ఒత్తిడికి గురయ్యాడు. భార్య ఇంట్లో లేని సమయంలో ఇద్దరు పిల్లను చంపేశాడు. తాను బయటకు వెళ్లి మెట్రో కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఓ వ్యాపారవేత్త కథ.. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ లోని షాలీమార్ బాగ్ ప్రాంతానికి చెందిన  వ్యాపారవేత్త మధుర్ మలానీ(44)  కి భార్య రూపాలి, కుమార్తె సమీక్ష(14), కుమారుడు శ్రేయాన్స్(6) ఉన్నారు. చాలా సంతోషంగా ఉండేవారు. అనుకోకుండా మధుర్ మలానీకి చెందిన వ్యాపారంలో నష్టం వచ్చింది. అతనికి చెందని సాండ్ పేపర్ ఫ్యాక్టరీని ఆరు నెలల క్రితం మూసివేశారు.

దీంతో ఆర్థికంగా అతనికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఫ్యాక్టరీ మూసివేసిన నాటి నుంచి మధుర్ తల్లిదండ్రులే వీళ్ల కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నారు. అయితే... మళ్లీ వ్యాపారం  చేయడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఎక్కడా ఉద్యోగం కూడా దొరకలేదు. దీంతో కుటుంబ పోషణ రోజు రోజుకీ భారంగా మారింది.

Also Read బరువు తగ్గడానికి ట్యాబ్లెట్స్ మింగిన డ్యాన్సర్.. కొద్దిసేపటికే.

అదీ కాక.. ఇంట్లో ఖర్చుల కోసం కన్న తల్లిదండ్రులపై ఆధారపడలేకపోయాడు. దీంతో భార్య కూరగాయాల కోసం బయటకు వెళ్లడాన్ని అవకాశం గా తీసుసుకున్నాడు. ఇద్దరు పిల్లలను చంపేసి బెడ్ పై పడుకోబెట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లిన రూపాలి తిరిగి వచ్చి చూసేసరికి ఇద్దరు బిడ్డలు శవాలై కనిపించారు.

దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు మధుర్ మలానీ కోసం గాలించారు. కాగా... మెట్రో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆలస్యంగా తెలిసింది. ఆర్థిక సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇద్దరు చిన్నారులను ఏవిధంగా చంపాడు అనే విషయం మాత్రం తెలియలేదు. పోస్ట్ మార్టం తర్వాతే చిన్నారులు ఎలా చనిపోయారు అనే విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.