Asianet News TeluguAsianet News Telugu

పనికిమాలిన పిల్‌....పిటీషనర్ కు కోర్టు వినూత్న జరిమానా

కర్నాటక హైకోర్టు వినూత్న రీతిలో తీర్పునిచ్చింది. పిటిషన్ ను పనికిమాలిన పిల్ గా బెంచ్ కొట్టిపారేసింది. అంతేకాదు పిటిషనర్ కు 5వేల రూపాయలు జరిమానా విధించి ఆ జరిమానాను కొడగు వరద బాధితులకు అందించాల్సింది ఆదేశించింది. నెలలోపు సీఎం సహాయనిధికి సొమ్ము జమ చెయ్యాలని స్పష్టం చేసింది. 
 

Deposit Rs 5,000 for flood relief: Karnataka High Court to m ..
Author
Karnataka, First Published Aug 24, 2018, 6:45 PM IST

బెంగళూరు: కర్నాటక హైకోర్టు వినూత్న రీతిలో తీర్పునిచ్చింది. పిటిషన్ ను పనికిమాలిన పిల్ గా బెంచ్ కొట్టిపారేసింది. అంతేకాదు పిటిషనర్ కు 5వేల రూపాయలు జరిమానా విధించి ఆ జరిమానాను కొడగు వరద బాధితులకు అందించాల్సింది ఆదేశించింది. నెలలోపు సీఎం సహాయనిధికి సొమ్ము జమ చెయ్యాలని స్పష్టం చేసింది. 

వివరాల్లోకి వెళ్తే శివమోగ జిల్లా తుడూర్ గ్రామానికి చెందిన హరిశ్చంద్రగౌడ్ 2008 నవంబర్ 26న ముంబై ఉగ్రదాడిపై తాను అందించిన సమాచారాన్ని పట్టించుకోలేదంటూ పిటీషన్ దాఖలు చేశారు. అయితే పిటీషన్ ను పరిశీలించిన బెంచ్ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ పనికిమాలిన పిల్‌గా బెంచ్‌ కొట్టిపారేసింది. 

పిటిషనరుకు 5వేల జరిమానా విధించింది. 5వేల రూపాయలను కొడగు వరద బాధితులకు అందించాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేశ్‌ మహేశ్వరి నేతృత‍్వంలోని బెంచ్‌ ఆదేశించింది. 30రోజులలోపు ముఖ్యమంత్రి సహాయనిధి ఈ సొమ్మును డిపాజిట్‌ చేయాలని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన మెమోను కూడా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. ఇకపై ఇలాంటి వ్యర్థమైన పిటిషన్లు దాఖలు చేయవద్దని, నిజమైన సమస్యలపై స్పందించాలని సూచించింది బెంచ్. 

అయితే తాను నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన వాడినని 42 సంవత్సరాలు పాటు ఏఐసీసీలో కొనసాగినట్టు గౌడ చెప్పుకున్నారు. 2005లో కూడా తాను అధికారులను హెచ్చరించానని అయినా అధికారులు పట్టించుకోలేదని వాదించారు. ఈ నేపథ్యంలో 2010జూన్‌లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు లేఖ రాయగా ఆమె మహారాష్ట్ర మంత్రిత్వశాఖకు రాశారని తెలిపారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని పిటీషనర్ హరిశ్చంద్ర గౌడ వాదించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios