రాంచీ:తన భార్యకు వైద్యం చేయించేందుకు ఓ వ్యక్తి బెంగాల్ రాష్ట్రం నుండి జార్ఖండ్ రాష్ట్రానికి భార్యను సైకిల్ పై తీసుకొచ్చాడు. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పురులియా జిల్లాకు చెందిన హరి అనే వ్యక్తి రిక్షా కార్మికుడు. కరోనా వైరస్ నేపథ్యంలో  వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించడంతో తన భార్యను కాపాడుకొనేందుకు ఆయన భార్యను జార్ఖండ్ కు తీసుకెళ్లాడు.భార్యను, ఏడేళ్ల కూతురిని తీసుకొని ఆయన సైకిల్ పై జంషెడ్ పూర్ కు తీసుకొచ్చాడు. వంద కిలోమీటర్ల దూరం సైకిల్ పై బయలుదేరాడు. 

గంగా మెమోరియల్ ఆసుపత్రిలో తన భార్య బాందిని వైద్యులు పరీక్షించారు. ఆ  సమయంలో తన భార్య తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్టుగా గుర్తించారు.
వెంటనే ఆమెకు ఉచితంగానే ఆపరేషన్ చేశారని ఆయన చెప్పారు.

కానీ, పురులియాలోని ఆసుపత్రికి తన భార్యను తీసుకెళ్లినప్పుడు కనీసం తన భార్యను చూడడానికి కూడ వైద్యులు ఇష్టపడలేదన్నారు. కరోనాను వ్యాప్తి చెందింపజేసేందుకు వచ్చావా అంటూ తనపై దురుసుగా మాట్లాడారని చెప్పారు. ఈ మాటలు విన్న తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించానని చెప్పారు.

అయితే ధైర్యాన్ని కూడదీసుకొని తాను తన భార్య కూతురిని తీసుకొని సైకిల్ పై జంషెడ్ పూర్ లలోని ఆసుపత్రికి తీసుకొచ్చినట్టుగా చెప్పారు.సైకిల్ ను అద్దెకు తీసుకొని ఆయన ఈ ఆసుపత్రికి చేరుకొన్నాడు. 

ప్రైవేట్ ఆసుపత్రి అయినా కూడ గంగా మెమోరియల్ ఆసుపత్రిలో తన భార్యకు ఉచితంగా ఆపరేషన్ నిర్వహించినట్టుగా  హరి తెలిపారు.అద్దెకు సైకిల్ ను తీసుకొని తన భార్యను తీసుకొని వచ్చిన  హరి తీసుకొచ్చిన విషయాన్ని డాక్టర్ సింగ్ తెలుసుకొన్నారు.కొంత డబ్బుతో పాటు ఓ సైకిల్ ను కూడ అతనికి ఇచ్చి పంపాడు డాక్టర్ సింగ్.