వెల్లూరు: తమిళనాడులో దారుణం చోటు చేసుకొంది.ఓ దళితుడి మృతదేహన్ని 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి పై నుండి తాళ్లకు కట్టి దించారు. అగ్రవర్ణాలకు చెందిన పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లకుండా అంగీకరించకపోవడంతో ఇలా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. వన్నియంబాడికి సమీపంలోని నారాయణపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

ఓ దళిత వ్యక్తి మృతి చెందాడు. అతడి మృతదేహన్ని  స్మశానవాటికకు తరలించాలంటే ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన పొలాల నుండి  తరలించాల్సి ఉంది. అయితే  ఈ విషయమై  అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు అడ్డుచెప్పారు. దీంతో సమీపంలోని 20 అడుగుల ఎత్తు నుండి మృతదేహన్ని తరలించారు.