Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ బ్యూరోక్రాట్ల లేఖ  

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన బిజెపి ఎంపి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 103 మంది మాజీ బ్యూరోక్రాట్ల బృందం లోక్‌సభ స్పీకర్,ఎథిక్స్ కమిటీని కోరింది. ఎంపీ  ప్రగ్యా కర్ణాటకలోని శివమొగ్గలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందువులు ఆయుధాలు చేపట్టాలని సూచించారు. 

Demanded Lok Sabha Speaker To Take Action Against BJP MP Pragya Singh Thakur For Hate Speech
Author
First Published Jan 8, 2023, 1:43 AM IST

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన బిజెపి ఎంపి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌పై  చర్యలు తీసుకోవాలని దేశంలోని 103 మంది మాజీ బ్యూరోక్రాట్ల బృందం డిమాండ్ చేసింది. ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌  వ్యాఖ్యలు హిందూయేతర వర్గాలపై ద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ఉందని లోక్‌సభ స్పీకర్, ఎథిక్స్ కమిటీకి చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది. కర్ణాటకలో ఠాకూర్ చేసిన ప్రసంగం 'హిందూయేతర వర్గాలపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం' అని మాజీ బ్యూరోక్రాట్లు పేర్కొన్నారు.

పదేపదే రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్ల ప్రగ్యా సింగ్ ఠాకూర్ పార్లమెంటు సభ్యుడిగా ఉండే నైతిక హక్కును కోల్పోయారని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. దేశానికి చట్టాలను రూపొందించే పార్లమెంటు సభలపై ప్రత్యేక బాధ్యత ఉందని  పేర్కొన్నారు. రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడాన్ని ఖచ్చితంగా దాని సభ్యులను అనుమతించలేమనీ, అందుచేత, తగిన చర్య కోసం లోక్‌సభ ఎథిక్స్ కమిటీకి ఈ విషయాన్ని సూచించవలసిందిగా తాము గౌరవనీయ లోక్‌సభ స్పీకర్‌ను కోరుతున్నామని తెలిపారు.

లేఖపై సంతకం చేసిన 103 మందిలో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ శాఖ మాజీ కార్యదర్శి అనితా అగ్నిహోత్రి, రాజస్థాన్ మాజీ ప్రధాన కార్యదర్శి సలావుద్దీన్ అహ్మద్, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎస్పీ ఆంబ్రోస్ , ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్, ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) మాజీ అధికారి ఎ.ఎస్. దులత్, జూలియో రిబీరో మరియు అమితాబ్ మాథుర్ మరియు మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి T.K.A. నాయర్ మరియు కె. సుజాతరావు ఉన్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

అంతకుముందు డిసెంబర్ 25న.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో హిందూ జాగరణ్ వేదిక జరిగిన దక్షిణ ప్రాంతీయ విభాగం వార్షిక సదస్సులో ఎంపి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ ప్రసంగిస్తూ.. "మా ఇళ్లలోకి చొరబడిన" వారికి తగిన సమాధానం ఇవ్వాలని ఠాకూర్ చెప్పినట్లు తెలిసింది. 'హిందూ కార్యకర్తల హత్య' ఘటనల నేపథ్యంలో ఠాకూర్ మాట్లాడుతూ తమపై దాడి చేసేవారికి, వారి పరువుకు బదులిచ్చే హక్కు హిందువులకు ఉందని అన్నారు. తమను తాము రక్షించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నందున హిందూవులు  తమ ఇళ్లలో కత్తులు పదును పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.

ముస్లింల పేరు ప్రస్తావించకుండా సాధ్వి మాట్లాడుతూ..  "లవ్ జిహాద్ పేరుతో వారికి జిహాద్ అనే ఓ సంప్రదాయం ఉంది. వాళ్లు ప్రేమ పేరుతో జిహాద్ చేయరు. జిహాద్ పేరుతో ప్రేమిస్తారు. మనం (హిందువులు) కూడా ప్రేమిస్తాం, దేవుడిని ప్రేమిస్తాం, ఒక సన్యాసి తన దేవుడిని ప్రేమిస్తాడు" అని ఠాకూర్ అన్నారు. దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణచివేతదారులను, పాపాత్ములందరినీ అంతం చేయాలని సాధ్వీ చెప్పారు. కాకపోతే ప్రేమకు నిజమైన నిర్వచనం ఇక్కడ ఉండదని.. అందుకు సంబంధించిన వారికి సమాధానం చెప్పండి.

లవ్ జిహాద్ పేరుతో మోసపోకుండా మీ అమ్మాయిలను రక్షించండి. వారికి సరైన విలువలు నేర్పండని అన్నారు. శివమొగ్గకు చెందిన హర్షతో సహా హిందువుల కార్యకర్తల హత్యలను ప్రస్తవిస్తూ.. ఆత్మరక్షణ కోసం ఇంట్లో కత్తులు పదును పెట్టుకోవాలని ఆమె ప్రజలను కోరారు. గత్యంతరం లేక కనీసం  కూరగాయలు కోసుకోవడానికైనా ఉపయోగపడతాయి. ఏమో, ఏం అవసరం వస్తుందో ఎవరికి తెలుసు? తమను తాము రక్షించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఎవరైనా మనపైకి దాడికి ప్రయత్నిస్తే వారికి తిరిగి అదే స్థాయిలో జవాబు ఇవ్వడం కూడా హక్కు కిందే’’ అని ప్రగ్యాసింగ్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios