కరోనా రోగులకు ఫైవ్ స్టార్ హోటల్‌లో చికిత్స

 దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా రోగులకు ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ మాన్ సింగ్ సేవలు అందించనుంది. గంగారాం ఆసుపత్రికి అనుబంధంగా ఈ హోటల్ పనిచేయనుంది. 

Delhis 5Star Taj Mansingh Hotel Now A Coronavirus Facility


న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా రోగులకు ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ మాన్ సింగ్ సేవలు అందించనుంది. గంగారాం ఆసుపత్రికి అనుబంధంగా ఈ హోటల్ పనిచేయనుంది. 

ఈ హోటల్ లో  కరోనా రోగులకు ఆహారం, గదులను ఈ హోటల్ సమకూర్చనుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజూ ఫైవ్ స్టార్ హోటల్ లో రోజూ రూ. 5 వేలతో పాటు వైద్య సేవలు అందించినందుకు మరో ఐదు వేలను వసూలు చేస్తారు. ఆసుపత్రికి రోగులు చెల్లించే డబ్బులను హోటల్ కు రీ ఎంబర్స్ చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

ఆక్సిజన్ సిలిండర్ కేటాయిస్తే ప్రతి రోగి రోజూ రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ హోటల్ సిబ్బందికి కొన్ని అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆసుపత్రికి చెందిన వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడ హోటల్ లో ఉండేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 

ఢిల్లీలోని ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరిపోను బెడ్స్ లేని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడ బెడ్స్ ను కూడ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మరో వైపు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం 500 రైల్వే కోచ్‌లను కూడ అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios