అమ్మాయే కానీ... అబ్బాయిలా వేషం మార్చింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో చేతులు కలిపింది. ఇక ఇద్దరూ కలిసి చైన్ స్నాచింగ్ లకు పాల్పడటం మొదలుపెట్టారు. కానీ చివరకు పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని మాయాపురికి చెందిన అంజలి(22) అనే యువతి దొంగగా మారింది. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు అబ్బాయిలా వేషం మార్చుకుంది.  తన ఫ్రెండ్ రాజు(26)తో కలిసి బంగారు గొలుసులు, మొబైల్ ఫోన్ల స్నాచింగులకు తెర లేపింది. ఆమె పురుషుడు వేషంలో ఉండటంతో... ఎవరికీ ఆమెపై ఎప్పుడూ అనుమానం కలగేదు. 

ముఖ్యంగా ఢిల్లీలోని పార్కులు, బస్ స్టాపులు లక్ష్యంగా చేసుకొని అంజలి ఈ స్నాచింగులకు పాల్పడేది. ఓ వ్యక్తి అందించిన సమాచారం మేర పోలీసులు ఈ ఇద్దరు తోడు దొంగలను అరెస్టు చేశారు. అరెస్టు చేశాక ఆమె పరుషుడు కాదు మహిళ అని తెలిసింది. పోలీసులు కూడా షాక్ కి గురయ్యారు.నిందితుల దగ్గర నుంచి చోరీ అయిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.