Asianet News TeluguAsianet News Telugu

అప్పు ఇచ్చి ప్రాణాల మీదికి తెచ్చుకుంది.. డబ్బు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో మహిళ హత్య.. శవాన్ని ఏం చేశారంటే?

ఢిల్లీలో ఓ మహిళను హతమార్చారు. తాను అప్పుగా ఇచ్చిన డబ్బునే వెనక్కివ్వాలని ఒత్తిడి చేయడంతో కొందరు నిందితులుు ఆమెను చంపేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని స్మశాన వాటికలో పాతిపెట్టారు.

delhi woman murdered over loan dispute, buried in graveyard
Author
First Published Jan 12, 2023, 4:58 PM IST

న్యూఢిల్లీ: అప్పు ఇచ్చి ఓ మహిళ తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది. తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె రుణ గ్రహీతలపై ఒత్తిడి తెచ్చింది. దీంతో వారు ఆ మహిళను పొట్టనబెట్టుకున్నారు. గుట్టుగా ఓ స్మశాన వాటికలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమె మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించగా దొరికిన సమాచారంతో పాతిపెట్టిన మీనా వాధవాన్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఢిల్లీలో కొన్నాళ్లుగా ఘోర నేరాలు రిపోర్ట్ అవుతున్నాయి. చంపేసిన డెడ్ బాడీలను ఊహకు అందని విధంగా పడేయడం చేస్తున్నారు. ఈ నేరంలో వారు ఆ మృతదేహాన్ని అధికారికంగా ఎక్కడా నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్మశాన వాటికలో పాతిపెట్టారు.

54 ఏళ్ల మీనా వాధవాన్ డబ్బులు అప్పుగా ఇస్తుండేది. ముఖ్యంగా కార్మికులు, దినసరి కూలీలకు చిన్న మొత్తాల్లో రుణాలు ఇస్తుండేది. అలాగే.. రుణం ఇచ్చిన కొందరిని తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేసింది. కానీ, వారు ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా ఏకంగా ఆమెనే చంపేసేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ ఆలోచనతోనే వాధవాన్‌ను హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో ముగ్గురు రెహాన్, మొబిన్ ఖాన్, నవీన్‌లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. వారిని విచారించారు.

Also Read: ఎనిమిదేళ్ల నాటి హత్య కేసు.. ఆమ్రపాలి గ్రూప్‌ మాజీ సీఎండీ అనిల్‌ శర్మపై కేసు నమోదు చేసిన సీబీఐ..

జనవరి 2వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ మహిళ మళ్లీ తిరిగి రాలేదు. ఇప్పుడే వస్తా అని వెళ్లిన వాధవాన్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మీనా వాధవాన్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఆమె కనిపించకుండా పోవడం వెనుక నిందితుడు మొబిన్ హస్తం ఉండొచ్చని ఆరోపించారు.

ఈ ఫిర్యాదు అందగానే పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అదే సందర్భంలో మొబిన్‌ను ప్రశ్నించడం కూడా సాగింది. దర్యాప్తులో మొబిన్ తన నేరాన్ని అంగీకరించాడు. మీనా వాధవాన్ హత్యలో తన ప్రమేయం కూడా ఉన్నట్టు చెప్పాడు. మొబిన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్మశాన వాటికకు వెళ్లారు. అతడు చెప్పిన సూచనలతో పోలీసులు పాతిపెట్టిన వాధవాన్ మృతదేహాన్ని తవ్వి బయటకు తీశారు.

స్మశాన వాటిక కేర్‌టేకర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ శవాన్ని పాతిపెట్టిన విషయాన్ని అతను అధికారిక రిజిస్టర్‌లో పొందుపరచలేదు. నిందితుల నుంచి అతను రూ. 5,000లు తీసుకున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios