దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. ఓ మహిళ టీచర్ పట్ల దారుణంగా వ్యవహరించారు. తన ఫోన్ కోసం వారు రాక్షసుల్లా ప్రవరించారు. ఇంతకీ ఏం జరిగిందంటే? 

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. ఆటోలో వెళ్తున్న ఓ మహిళా టీచర్ పట్ట దారుణంగా వ్యవహరించారు. ఆమె మొబైల్ ఫోన్ ను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో ఆ దుండగులు రాక్షసులుగా ప్రవర్తించారు. ఆ మహిళలను ఆటోలో నుంచి బయటకు లాగేశారు. ఆ మహిళ రోడ్డుపై పడిందనే కనికరం లేకుండా.. ఈడ్చుకెళ్లారు. తన ఐ ఫోన్ ను లాక్కుని పరార్ అయ్యారు. ఈ క్రమంలో ఆ మహిళా ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలిని దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలు యోవికా చౌదరి పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె ఐఫోన్‌ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని దేవ్లీలో నివాసముంటున్న యోవికా చౌదరి ఓ ప్రయివేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది. ఎప్పటిలాగే.. శుక్రవారం కూడా ఆమె తన పాఠశాల నుంచి ఇంటికి ఆటోలో తిరిగి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఆమె వద్ద ఐఫోన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ ఎలాగైనా దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు. 

ఈ క్రమంలో దుండగులు ఆమె ప్రయాణిస్తున్న ఆటోను బైక్ పై ఫాలో అయ్యారు. అదును చూసి.. ఆ మహిళ టీచర్ ఐ ఫోన్ ను లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. సమయం చూసి.. ఆ టీచర్ ను ఆటోలో నుంచి బయటకు లాగారు. ఆమె రోడ్డుపై పడిందనే కనికరం లేకుండా ఆ యువకులు ఆ టీచర్ను అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లారు. అనంతరం ఆమె మొబైల్‌ను స్నాచర్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో యోవికా ముక్కుకు తీవ్రగాయమైంది. పలు చాలా చోట్ల గాయాలయ్యాయి. బాధితురాలు సాకేత్‌లోని జ్ఞాన్‌ భారతి స్కూల్‌లో ఉపాధ్యాయురాలు.

బాధితురాలు సాకేత్‌లోని పీవీఆర్‌ నుంచి ఆటోలో తన ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. ఇంతలో కొంత మంది దుండగులు బైక్‌పై వెంబడించారు. ఖోఖా మార్కెట్ సమీపంలో తనను కిందపడేసి.. తన వద్ద ఉన్న ఐఫోన్ 13ని లాక్కెళ్లారు. ఐఫోన్‌ను కాపాడే ప్రయత్నంలో యోవిక ఆటోపై నుంచి కిందపడింది. ఈ క్రమంలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. 

స్నాచర్లపై సాకేత్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. సాకేత్‌లోని ఖోఖా మార్కెట్ సమీపంలోని చారిటన్ హోటల్ సమీపంలో ఈ దోపిడీ ఘటన చోటుచేసుకుంది.