న్యూఢిల్లీ: రెచ్చగొట్టే ప్రసంగాలే ఢిల్లీ అల్లర్లకు కారణమని కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ  కమిటీ సోమవారం నాడు సోనియాగాంధీకి నివేదికను సమర్పించింది.
ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ అల్లర్లు జరిగిన ప్రాంతంలో  పర్యటించి బాధితుల నుండి  కాంగ్రెస్ పార్టీ వివరాలను సేకరించింది. 

ఈ అల్లర్ల సమయంలో మృతి చెందిన ఐబీ అధికారి అంకిత్ శర్మ కుటుంబాన్ని కూడ కాంగ్రెస్ పార్టీ  నిజనిర్ధారణ కమిటీ  ప్రతినిధి బృందం పరిశీలించింది. 
ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముకుల్ వాస్నిక్, తారిక్ అన్వర్, సుష్మిత దేవ్, కుమారి షెల్జాలు ఉన్నారు.

ఢిల్లీ అల్లర్లలో 53 మంది మృతి చెందారు. సుమారు 200 మంది గాయపడ్డారు.  ఈ ఘటన గత మాసంలో  చోటు చేసుకొంది. ఢిల్లీ అల్లర్లలో ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజాపూర్, చాంద్‌బాగ్, కౌరేజ్ ఖాస్, బాజాపురా ప్రాంతాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి.