Asianet News TeluguAsianet News Telugu

కొత్త ట్రాఫిక్ చట్టం... ట్రక్కు డ్రైవర్ కి రూ.2లక్షల జరిమానా

నూతన వాహన చట్టం ప్రకారం ట్రక్కులో పరిమితికి మించి లోడ్ ఉన్నందున 20వేల రూపాయల జరిమానా విధించారు. దానికి అదనంగా... నిర్దేశించిన లోడ్‌కు మించి తీసుకెళ్తున్న ప్రతి టన్నుకు 2వేల చొప్పున ఫైన్ వేసి.. మొత్తం రూ.2లక్షల 500 రసీదును చేతిలో పెట్టారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన జరిమానాల రికార్డులను ఈ చలాన్ తిరగ రాసింది. 
 

Delhi: Truck driver fined Rs 2 lakh, heaviest since amended Motor vehicles Act Implemented
Author
Hyderabad, First Published Sep 13, 2019, 10:48 AM IST

కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చాక.. వాహనదారులకు దూల తీరిపోతుంది. ఇప్పటి వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా... పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులకు దొరికినా... తక్కువ జరిమానాలతో సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. చట్టం మారేసరికి... భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. తాజాగా ఓ ట్రక్కు డ్రైవర్ కి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.2లక్షల జరిమానా విధించారు. ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో జరిమానా పడటం ఇదే తొలిసారి. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దేశరాజధాని ఢిల్లీలోని ముకర్బా చౌక్ ప్రాంతంలో.. ఓవర్‌ లోడ్‌ కారణంగా ట్రక్కు డ్రైవర్‌కు 2లక్షల 500 రూపాయాలు ఫైన్ వేశారు. అంతేకాదు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. నూతన వాహన చట్టం ప్రకారం ట్రక్కులో పరిమితికి మించి లోడ్ ఉన్నందున 20వేల రూపాయల జరిమానా విధించారు. దానికి అదనంగా... నిర్దేశించిన లోడ్‌కు మించి తీసుకెళ్తున్న ప్రతి టన్నుకు 2వేల చొప్పున ఫైన్ వేసి.. మొత్తం రూ.2లక్షల 500 రసీదును చేతిలో పెట్టారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన జరిమానాల రికార్డులను ఈ చలాన్ తిరగ రాసింది. 

ట్రక్కు డ్రైవర్ పేరు రామ్ కిషన్. ఓవర్ లోడ్ కారణంగా 2లక్షల 500 రూపాయలు జరిమానాగా చెల్లించాడు. బుధవారం(సెప్టెంబర్ 11,2019) రాత్రి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు రామ్ కిషన్ ట్రక్కుని ఆపారు. ఆ బండిపై హర్యానా నెంబర్ ప్లేట్ ఉంది. రామ్ కిషన్ ట్రక్కుకి 25 టన్నుల వరకు లోడ్ ని తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఉంది. కానీ ట్రక్కులో 43 టన్నుల వరకు లోడ్ ఉంది. ఇది పరిమితికన్నా 18 టన్నులు అధికం. ఓవర్ లోడ్ మాత్రమే కాదు.. 10 రకాల ట్రాఫిక్ రూల్స్ ని కూడా రామ్ కిషన్ బ్రేక్ చేశాడు. సీటు బెల్టు పెట్టుకోలేదు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు.  అందుకే ఇంత మొత్తంలో జరిమానా పడింది.

ఇటీవల రాజస్థాన్ కి చెందిన ట్రక్కు డ్రైవర్‌కు రూ.లక్షన్నరకు పైగా జరిమానా పడింది. అదే పెద్ద మొత్తం అనుకునేలోగా... ఢిల్లీ ఘటన దానిని బ్రేక్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios