ఢిల్లీలో జరిగిన ఓ దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దొంగతనం కామనే.. కానీ ఆ దొంగ ప్రవర్తనే వింతగా ఉంది. బ్రాండ్ బాబులా ఉన్న ఆ దొంగ కథేమిటంటే.. 

దేశ రాజధాని ఢిల్లీలోని నోయిడాలో ఓ జర్నలిస్ట్ తన చేతితో ఫోన్ ఆపరేట్ చేస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెల్తున్నాడు. అంతలో నల్ల మాస్క్ ధరించిన వ్యక్తి హఠాత్తుగా వచ్చి.. ఫోన్ ఎత్తుకుపోయాడు. 

ఫోన్ చేతికి చిక్కగానే దొరకకుండా పారిపోయాడు. తన ఫోన్ లాక్కున్న దొంగను పట్టుకోవడానికి ఆ జర్నలిస్టు కూడా దొంగ వెంట పరుగులు పెట్టాడు. అయితే ఆ దొంగ కొద్ది దూరం వెళ్లి, తనను ఎవరూ చూడడం లేదని అనుకున్నాక.. తాను దొంగిలించిన ఫోన్ ను చూసుకున్నాడు. 

అయితే పాపం అప్పటికి కానీ ఆ దొంగకు తనకు కావాల్సిన బ్రాండ్ ఫోన్ అది కాదని రియలైజేషన్ అయ్యింది. వెంటనే వెనక్కి తిరిగి తాను ఎవరి దగ్గరైతే ఫోన్ దొంగిలించాడో అక్కడికే వచ్చాడు. 

అతనితో బ్రదర్ ఇది నాకు కావాల్సిన బ్రాండ్ ఫోన్ కాదు. నాకు వేరే బ్రాండ్ ఫోన్ కావాలి.. అంటూ ఆ ఫోన్ ను రోడ్డు మీదే వదిలేసి దొరకకుండా పారిపోయాడు. దొంగ వెనక్కి రావడమే షాక్ అంటే.. ఇక వాడిచ్చిన ఝలక్ కు ఆ జర్నలిస్ట్ కు షాక్ మీద షాక్ కొట్టినట్లైంది. 

అయితే కాసేపటికి ఆ షాక్ నుంచి తేరుకుని సదరు జర్నలిస్ట్ సరదాగా నవ్వుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ లో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇంకేముందు.. కామెంట్ల వరద మొదలయ్యింది. 

ఇంతకీ ఆ దొంగకు ఏ బ్రాండ్ ఫోన్ కావాలంటా అంటే..ఆ ఫోన్‌ దొంగకు వన్‌ప్లస్ 9ప్రో బ్రాండ్ మొబైల్ కావాలట. ఆ ఫోన్‌ కోసమే అతను మొబైల్ చోరీకి పాల్పడినట్లు సదరు జర్నలిస్టు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.