ట్యూషన్ చెప్పడానికి వచ్చి బాలికతో చనువుగా ఉన్నాడని ఓ 18యేళ్ల విద్యార్థిని కొట్టి చంపిన దుర్మార్గమైన  ఘటన ఢిల్లీలో జరిగింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లతో సహా ఐదుగురిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

పశ్చిమ ఢిల్లీలోని ఆదర్శనగర్ లో నివసించే రాహుల్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చదువుకుంటూనే హోం ట్యూటర్ గా పనిచేస్తున్నాడు. రాహుల్ మీద దాడి జరగడానికి ముందు అతను, బాలికతో మాట్లాడుతున్నట్టు సెక్యురిటీ ఫుటేజ్లో కనిపించాడు.

బాలికతో రాహుల్ చనువుగా ఉండడం వారి కుటుంబసభ్యలకు నచ్చలేదు. దీంతో బాలిక అన్న, అతనితో పాటు మరో ముగ్గురు మైనర్లు మొత్తం ఎనిమిది మంది దాడి చేసి కొట్టారు. చుట్టుపక్కల వాళ్లు రక్షించడానికి ప్రయత్నించినా వారు రాహుల్ ని తీవ్రంగా కొట్టారు.

గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్ ఆ తరువాత మరణించాడని పోలీస్ అధికారి విజయంత ఆర్య తెలిపారు. ఈ దాడికి కారణం వీరి కులాలు వేర్వేరు కావడమేనని పోలీసులు తెలిపారు.