Asianet News TeluguAsianet News Telugu

అమ్మాయిలపై వల్గర్ కామెంట్స్.. ఢిల్లీ స్కూల్ బాయ్స్ అరెస్ట్

అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి గ్రూప్ లలో షేర్ చేసుకున్నారు. వాళ్ల ఛాటింగ్ వ్యవహారాన్ని ఓ బాలిక బయటపెట్టడంతో.. ఈ వ్వవహారం వెలుగులోకి వచ్చింది. వారంతా కేవలం పది, ఇంటర్ చదివే విద్యార్థులు కావడం గమనార్హం.

Delhi Schoolboy Held Over Shocking Chatroom That Talked About Girls' Rape
Author
Hyderabad, First Published May 5, 2020, 12:50 PM IST

సోషల్ మీడియాలో ఓ గ్రూప్ క్రియేట్ చేసి.. అమ్మాయిలపై వల్గర్ కామెంట్స్ చేసిన ఢిల్లీ స్కూల్ బాయ్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...లాక్ డౌన్ లో స్కూళ్లు లేక ఇళ్లకే పరిమితం కావడంతో.. ఢిల్లీలోని టాప్ స్కూళ్లకు చెందిన కొందరు విద్యార్థులు ఓ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. 

‘బాయ్స్ లాకర్ రూమ్’ పేరిట గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్నేహితులంతా ముచ్చటించుకున్నారు.

అయితే.. వాళ్ల మాటల్లో కేవలం అమ్మాయిలే టాపిక్ కావడం గమనార్హం. తమ క్లాస్ అమ్మాయిల డ్రస్ ల గురించి.. వాళ్ల బాడీ పార్ట్స్ గురించి అందులో వారు వర్ణించుకున్నారు.

ఏ అమ్మాయిని టార్గెట్ చేయాలని.. ఎక్కడికి పిలిచి అందరూ కలిసి గ్యాంగ్ రేప్ చేయాలి వంటి డిస్కస్ చేయడం గమనార్హం. అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి గ్రూప్ లలో షేర్ చేసుకున్నారు.

వాళ్ల ఛాటింగ్ వ్యవహారాన్ని ఓ బాలిక బయటపెట్టడంతో.. ఈ వ్వవహారం వెలుగులోకి వచ్చింది. వారంతా కేవలం పది, ఇంటర్ చదివే విద్యార్థులు కావడం గమనార్హం.

కాగా.. వీరి గ్రూప్, వారి ఛాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. 

ప్రతి ఒక్కరూ సదరు విద్యార్థులపై చర్యలు తీసుకోవాంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

దీంతో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. సదరు విద్యార్ధుల గ్రూప్ ని డీ యాక్టివేట్ చేశారు. తాజాగా ఆ గ్రూప్ లోని ఓ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్రూప్ లో దాదాపు 20మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. వారంతా ఢిల్లీలోని టాప్ స్కూల్ స్టూడెంట్స్ కావడం శోచనీయం. సదరు విద్యార్థి ఫోన్ ని పోలీసులు సీజ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios