ఢిల్లీ అల్లర్ల కేసులో కర్కర్దూమా కోర్టు తొమ్మిది మంది దోషులకు శిక్ష విధించింది, 7 సంవత్సరాలు జైలులో ఉండవలసి ఉంటుంది.

Delhi riots: ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తొమ్మిది మంది దోషులకు ఢిల్లీ కోర్టు మంగళవారం నాడు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దేశ రాజధాని నగరంలోని గోకల్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి.

సమాచారం ప్రకారం.. 2020, ఫిబ్రవరి 24-25 మధ్య రాత్రి గోకల్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ్ విహార్ తిరాహా వద్ద ఉన్న చమన్ పార్క్‌లో అల్లర్లు రేఖా శర్మ ఇంటికి నిప్పు పెట్టారు. ఇంటి పై అంతస్తులోని గదులు దగ్ధమయ్యాయి. ఈ కేసులో మహ్మద్ షానవాజ్ అలియాస్ షాను, షారుక్, రషీద్ అలియాస్ రాజా, శివవిహార్ నివాసి రషీద్ అలియాస్ మోను, బ్రిజ్‌పురి నివాసి మహ్మద్ ఫైసల్, కరవాల్ నగర్ నివాసి పర్వేజ్, ఇందిరా విహార్ చమన్ పార్క్ నివాసి అష్రఫ్ అలీ, బాబు నగర్, మహ్మద్ షోయబ్ అలియాస్ చుత్వా , పాత ముస్తఫా నివాసి ఆజాద్‌లకు శిక్ష పడింది.

ఈ దోషులందరూ సెక్షన్ 149 IPC, అలాగే సెక్షన్ 188 IPC ప్రకారం శిక్షార్హమైన నేరాలకు పాల్పడిన దోషులుగా నిర్ధారించబడ్డారు. వారు మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టినట్టు రుజువైంది. "హిందూ సమాజానికి చెందిన వ్యక్తులతో పాటు వారి ఆస్తులకు నష్టం కలిగించడం, హిందూ సమాజ సభ్యుల మనస్సులలో భయం, అభద్రతను సృష్టించారనీ, విధ్వంసం, దొంగతనాలకు పాల్పడినట్లు కోర్టు పేర్కొంది. తొమ్మిది మంది దోషులలో ఒక్కొక్కరికి రూ. 21,000 జరిమానా విధించింది. మొత్తం మొత్తంలో రూ. 1.5 లక్షలను ఫిర్యాదుదారు/బాధితుడికి పరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

“మతోన్మాద అల్లర్లు.. దేశ పౌరుల మధ్య సోదర భావాన్ని దెబ్బతీస్తాయి. అది దేశ సమైక్యత భావానికి ముప్పు. ఈ అల్లర్లు సమాజాన్ని పీడించే రుగ్మత. ఈ అల్లర్లను అత్యంత హింసాత్మక రూపాల్లో ఒకటిగా పరిగణించాలి. వీటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీయడమే కాకుండా.. సామాజిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోంది. మతపరమైన అల్లర్ల సమయంలో.. అమాయక సాధారణ ప్రజలు తమ నియంత్రణకు మించిన పరిస్థితులలో చిక్కుకుంటారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు కూడా దారి తీస్తుంది “అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో కూడా దోషిలు మతపరమైన అల్లర్లకు పాల్పడ్డారు. దాని ప్రభావం ప్రభావిత ప్రాంతంలో నివసించే ప్రజలకే పరిమితం కాకుండా, సమాజంలోని పరిమితికి మించి ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసిందని కోర్టు అభిప్రాయపడింది.